Movie Tickets Highcourt : సినిమా టిక్కెట్లపై అఫిడవిట్‌కు సమయం కావాలన్న ప్రభుత్వం..., ఫిబ్రవరికి వాయిదా వేసిన హైకోర్టు !
సినిమా టిక్కెట్ల అంశంపై విచారణను ఫిబ్రవరి పదో తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అఫిడవిట్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది.
సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశంపై అఫిడవిట్ దాఖలు చేయడానికి హైకోర్టును ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. దీంతో హైకోర్టు విచారణను ఫిబ్రవరి పదో తేదీకి వాయిదా వేసింది. టికెట్ల ధరలను నిర్దేశిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కమిటీ వేసి ధరలను ఖరారుచేయాలని హైకోర్టు ఆదే్శించింది. ఈ అంశంపై తదుపరి విచారణ సోమవారం జరిగింది.
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి చేయడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు సహా గ్రామీణ ప్రాంతాల్లో సినిమా హాళ్ల వరకూ విక్రయించే టికెట్ల ధరలను నిర్ధారిస్తూ జగన్ సర్కార్ ఇదివరకు జీవో 35ను జారీ చేసింది. ఇందులో అతి తక్కువ ధరలు ఉండటంతో ఇండస్ట్రీ అసంతృప్తితో ఉంది. ఈ అంశంపై వివాదం కొనసాగుతోంది. టిక్కెట్ రేట్లను పెంచాలని టాలీవుడ్ కోరుతోంది ., కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుముఖంగా లేదు. ప్రజలకు వినోదాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తూంటే కొంత మంది విమర్శిస్తున్నారని సీఎం జగన్ అంటున్నారు.
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
అయితే హైకోర్టు సూచనల మేరకు అధికారులతో పాటు టాలీవుడ్ ప్రతినిధులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ సమావేశం ఓ సారి జరిగింది. మరో వారంలో మరోసారి జరగనుంది . ప్రత్యేకంగా సమయం లేకపోయినా ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా చర్చలు పూర్తి కాలేదు బట్టి అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వం సమయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
టిక్కెట్ల ధరలు అతి తక్కువగా ఉండటంతో పెద్ద సినిమాల నిర్మాతలు సినిమాల విడుదల చేయడాన్ని నిలిపివేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్‌లోనూ కొత్తగా ఈ అంశంపై రచ్చ ప్రారంభమైంది. అందర్నీ కలుపుకుని వెళ్లి ప్రభుత్వంతో చర్చించాలంటూ మోహన్ బాబు సినీ పరిశ్రమకు బ హిరంగ లేఖ రాయడం కలకలం రేపుతోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి