అన్వేషించండి

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్

Minister Bharat: తెలుగుదేశం పార్టీలో ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్ అని..ఆయనే ముఖ్యమంమత్రి అవుతారని మంత్రి భరత్ ప్రకటించారు. జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh will become the Chief Minister: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం డిబేట్ కు పుల్‌స్టాప్ పెట్టాలని హైకమాండ్ ఆదేశాలు ఇస్తే..  మంత్రి భరత్ ముఖ్యమమంత్రి అనే చర్చను ప్రారంభించారు. జ్యూరిక్‌లో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి భరత్ మాట్లాడారు. ఈ సందర్భంగా  లోకేశ్‌ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు.  ఆ సమయంలో వేదికపై సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. టీడీపీలో ఫ్యూచర్ లీడర్‌ లోకేశ్ అని.. ఎవరికి నచ్చినా...నచ్చకపోయినా..ఫ్యూచర్‌ లీడర్‌ లోకేశ్‌  అని మంత్రి స్పష్టం చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేషేనన్నారు.                    

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని వరుసగా డిమాండ్లు వినిపించిన వారికి హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని స్ఫష్టం చేస్తూ హెచ్చరికలు పంపింది. అయితే అంతలోనే చంద్రబాబు, లోకేష్ సమక్షంలో మంత్రి టీజీ భరత్ ఈ డిబేట్ ను సీఎం స్థాయికి తీసుకెళ్లడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. టీడీపీలో ఫ్యూచర్ లీడర్‌ లోకేశ్.  ఎవరికి నచ్చినా...నచ్చకపోయినా..ఫ్యూచర్‌ లీడర్‌ లోకేశ్‌  . కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేషేనని  నేరుగా వారి సమక్షంలోనే భర్త చెప్పారు. జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన సందర్భంలో వారిని ఉద్దేశించి భరత్ మాట్లాడారు.  భరత్ ఏ ఉద్దేశంతో అన్నారో కానీ అది పార్టీ మీటింగ్ కాదు కాబట్టి వ్యక్తిగత అభిప్రాయం అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

నిజానికి  టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అంటే.. లోకేష్ తప్ప ఎవరూ కనిపించడం లేదు.  పూర్తి స్థాయిలో నారా లోకేష్ పార్టీపై పట్టు సాధిస్తున్నారు. ఆయన అన్ని స్థాయిల్లో పార్టీ నేతలతో పాటు కింది స్థాయి క్యాడర్ తోనూ అనుబంధం పెంచుకుంటున్నారు. ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత లోకేషేనని చెప్పాల్సిన పని లేదు. అయినా మంత్రి భరత్ ఈ డిమాండ్ ను వినిపించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఫ్యూచర్ సీఎం లోకేషేనని ప్రత్యేకంగా మద్దతు అడగాల్సిన పని కూడా లేదు. 

కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ కూడా సీఎం పదవి ఆశిస్తున్నారని కొంత మంది జనసేన నేతలు చెబుతున్నారు. కిరణ్ రాయల్ తాము పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకంటున్నామని చెప్పుకొచ్చారు. ఎవరి పార్టీ నేతలకు ఆయా పార్టీల నేతలు సీఎం కావాలని అంటుంది. అలాగే టీడీపీ నేతలకు..చంద్రబాబు తర్వాత లోకేషే సీఎం కావాలని అంటుంది. అందులో వివాదమేమీ ఉండదని భావిస్తున్నారు. అయితే అసలు ఈ చర్చ అంతా అనవసరం అని.. కూటమి ఏర్పడినప్పుడు ఒప్పందం ప్రకారం.. డిప్యూటీ సీఎం పోస్టు ఒకటే ఉండాలని అనుకున్నారని.. ఇంకా ఏమైనా మార్పులుంటే కూటమిలో నిర్ణయం తీసుకుంటారని అంత వరకూ చర్చలు వద్దని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mysterious Tree in Manyam Forest | ప్రాణాలు తీస్తున్న వింత వృక్షం..ఆ పల్లెలో అసలు ఏం జరుగుతోంది? | ABP DesamKL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025 PBKS VS GT Result Update : పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Kalki Koechlin: నిర్మాతను ఫోర్క్‌తో పొడిచేద్దాం అనుకున్న హీరోయిన్... ఎందుకో తెలుసా?
నిర్మాతను ఫోర్క్‌తో పొడిచేద్దాం అనుకున్న హీరోయిన్... ఎందుకో తెలుసా?
Robinhood First Review: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
Embed widget