Monkeys Survey: గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి? ఏఈఓలకు లెక్కింపు బాధ్యత
ఒకప్పుడు గ్రామాల్లో కోతులనేవి కనిపించేవి కావు. దారి తప్పి వచ్చిన వానరం అగుపిస్తే ఆశ్చర్యంగా చూసేవారు. ప్రస్తుతం భిన్నంగా ఉంది. అయితే.. వాటిని లెక్కించే పనిని.. ఏఈఓలకు అప్పజెప్పింది ప్రభుత్వం.
పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గుంపులు.. గుంపులుగా సంచరిస్తున్నాయి వానరాలు. ఇదివరకు మనిషిని చూస్తే భయపడే కోతులు ఇప్పుడు మనుషులనే బెదిరిస్తూ దాడులు చేస్తున్నాయి. పంటను ఇష్టం వచ్చినట్లు తెంపేస్తూ, సగం తిని సగం పడేస్తూ, మొక్కలను, తీగలను పీకేస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేల వద్ద కాపలా లేకుంటే దిగుబడి చేతికందే పరిస్థితి లేదని కొన్ని ప్రాంతాల్లో రైతులు వాపోతున్నారు.
కూరగాయల పంట మిగలట్లే..
గతంలో అడువులకు పరిమితమైన కోతుల్లో అడువుల్లో ఆహారం దొరక్కక గ్రామాల వైపు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామాలలోకి వచ్చి పంటలను నష్టం చేస్తున్నాయి. వరి, కంది, మొక్కజొన్న, పత్తి, చెరకు, పామాయిల్, పెసరతో పాటు కూరగాయ పంటలు సాగు చేస్తుంటారు. కోతుల బెడదతో బీర, కాకర, సొర, టమాటా తదితర కూరగాయాల పంటలు నాశనం అవుతున్నాయి. రైతులు కూరగాయలు సాగు చేయాలంటే చుట్టూ ప్రత్యేకమైన వలలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కోతుల బెడదతో కొంత మంది రైతులు పంట చేల వద్దే ఉండి కాపలా కాస్తున్నారు.
ఇళ్లను వదలని బెడద..
గ్రామాల్లో పంటపొలాలను కోతులు నష్టపరచడంతోపాటు ఇళ్లను వదలడం లేదు. ఇళ్లలోకి వచ్చి వంటసామగ్రిపై పడి దొరికినవి ఎత్తుకుపోతున్నాయి. ఎవరైనా వాటిని బెదిరిస్తే కొన్ని సార్లు దాడులకు దిగుతున్నాయి. ఇళ్లపైన బట్టలను వదలకుండా వాటిని ఎత్తుకెళుతున్నాయి. గతంలో ఇళ్లలో పండ్ల చెట్లు విరివిగా ఉండేవి. కోతుల కారణంగా అవి మిగలని పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రామాల్లో ప్రతి ఇంట్లో జామ చెట్లు అధికంగా ఉండేవి. ఇప్పుడు కోతుల భయానికి చెట్లను పెంచడం లేదు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్వే..
గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వాటి లెక్కను అంచనా వేసేందుకు సర్వే చేపడుతున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు చేపట్టారు. వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈఓ)లు పల్లెల్లో తిరుగుతూ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఏ మేరకు పంటలు ధ్వంసం చేశాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి ? చెట్లు, ఇళ్లు, గుట్టలు, పర్యాటక ప్రాంతం? రోడ్డు వెంట?.. ఇలా ఎక్కడ నివసిస్తున్నాయనే అంశాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. రైతులతో మాట్లాడిన తర్వాత వివరాలను ఆన్ లైన్.. క్రాప్ బుకింగ్ మాడ్యూల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వానరాలను భయపెట్టేందుకు ప్రజలు నైలాన్ వలలు, సోలార్ ఫెన్సింగ్, మంకీ గన్, కొండ ముచ్చులు, బొమ్మలు, పులి అరుపు తదితర శబ్ద పరికరాలు వినియోగిస్తున్నారా? అనే వివరాలు కూడా యాప్ లో పొందుపర్చాలి.
Also Read: Loan Apps Scam: చైనా లోన్ యాప్స్ స్కామ్ లో మరో కేసు... నకిలీ బిల్లులతో విదేశాలకు రూ.1400 మళ్లింపు...
Also Read: Cm Kcr: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన
Also Read: KTR Standup Comedy : ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?