Cm Kcr: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన
కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగుల ప్రక్రియ నాలుగైదు రోజుల్లో పూర్తి చేసి నివేదిక అందించాలన్నారు.
![Cm Kcr: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన Telangana cm kcr review meet with collector on employees transfers to news districts Cm Kcr: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/18/884c643258e99e3380df8491e03cb124_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, ధాన్యం సేకరణ, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నూతన జోనల్ విధానం అందుబాటులోకి వచ్చిన కారణంగా అందుకు అనుగుణంగా ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు కొనసాగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సమావేశం. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. pic.twitter.com/TxsCcm3JQc
— Telangana CMO (@TelanganaCMO) December 18, 2021
Also Read: ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?
జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన
కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతో ప్రభుత్వ పాలన సజావుగా సాగుకుందని కలెక్టర్లు తెలిపారు.
వెనక బడిన ప్రాంతాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుందని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే ఒకే చోట విధులు నిర్వర్తిస్తేనే మంచిదని సీఎం పేర్కొన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా సమస్యలు పరిష్కరించాలని సీఎం సూచించారు.
Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
ఉద్యోగుల విభజనపై నివేదిక
ఉద్యోగుల విభజన ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకునే ప్రక్రియ పూర్తైందని, ఈనెల 20న ఉద్యోగులకు కొత్త జిల్లాల వారీగా విభజన ప్రక్రియ పూర్తిచేసి కేటాయింపులు చేయనున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ కేటాయింపుల తర్వాత వారం రోజుల్లోగా ఉద్యోగులు విధుల్లోకి చేరాల్సి ఉంటుందన్నారు. వెనుకబడిన మారుమూల జిల్లాల్లో పాలన ప్రజలకు చేరాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా స్పౌస్ కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జోనల్ వ్యవస్థతో ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలో అమలవుతుందన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)