Pahalgam Attack: వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.

Pahalgam Attack: ఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఘటనకు కారణమైన వారిని పట్టుకునేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు లోయలో అణువణువూ గాలిస్తున్నారు. ఈ టైంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి ఏదైనా సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతి బుధవారం (ఏప్రిల్ 23, 2025) ప్రకటించారు.
ఈ దాడిపై ప్రభుత్వం ఘాటుగా స్పందిస్తున్న టైంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. కాశ్మీర్ లోయలో భారత ఏజెన్సీలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉగ్రవాదులను గుర్తించడానికి నిఘాను పెంచాయి. నిరంతర తనిఖీలు చేస్తున్నాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి, కాబట్టి మోడీ ప్రభుత్వం చర్య తీసుకుని సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీనితో పాటు, పాకిస్తాన్ పౌరులు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. వారికి వీసాలు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని సూచించింది ప్రభుత్వం.
JK Police announces reward of Rs 20 lakh for information on terrorists behind Pahalgam terror attack
— ANI Digital (@ani_digital) April 23, 2025
Read @ANI Story | https://t.co/nTm4PAsrPM#JammuKashmir #Police #CashReward #PahalgamTerrorAttack #Terrorists pic.twitter.com/Q5H15n7cLw
పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యలు
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి తిరుగులేని విధంగా మద్దతు ఇవ్వడం ఆపే వరకు 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు CCS నిర్ణయించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను తక్షణమే మూసివేయాలని నిర్ణయించినట్లు మిస్రి చెప్పారు. పాకిస్థాన్‌లో భారతీయులు చెల్లుబాటు అయ్యే అనుమతితో సరిహద్దు దాటిన మే1లోపు స్వదేశానికి చేరుకోవాలని ఆయన అన్నారు.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "Recognising the seriousness of this terrorist attack, the Cabinet Committee on Security (CCS) decided upon the following measures- The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan… pic.twitter.com/PxEPrrK1G8
— ANI (@ANI) April 23, 2025
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ/సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులు వారంలోపు దేశం విడిచి వెళ్లాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి ప్రభుత్వం తన రక్షణ/నావికాదళ/వైమానిక సలహాదారులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని మిస్రి చెప్పారు. "హైకమిషన్‌లోని సిబ్బంది సంఖ్య ప్రస్తుత 55 నుంచి 30కి తగ్గిస్తామని, ఇది మే 1 నుంచి అమలులోకి వస్తుందని" ఆయన అన్నారు.
ఈ దాడికి TRF బాధ్యత వహించింది
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ఆధీనంలో పని చేస్తున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించింది. భద్రతా సంస్థలు ఉగ్రవాదుల స్కెచ్‌లను కూడా విడుదల చేశాయి. అధికారుల ప్రకారం, వారి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా. లష్కరేకు చెందిన సైఫుల్లా కసూరి ఈ దాడికి ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు. 2023లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ గ్రూప్ ఉనికిలోకి వచ్చింది.





















