Hyderabad ED Searches: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు, ప్రముఖ గోల్డ్ షోరూంలో వరసగా రెండో రోజు
విజయవాడలోని బిగ్ సీ సంస్థ కార్యాలయాలు, షోరూంలలోనూ ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ సోదాలు జరుగుతున్నాయి. హార్డ్ డిస్క్ లు, డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేశారు.
హైదరాబాద్ లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెలర్స్ లో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వరుసగా తనిఖీలు చేయడం ఇది రెండో రోజు. 20 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముసద్దీలాల్ బంగారం దుకాణం నిర్వహించిన అన్ని బ్యాంకు లావాదేవీలు, బంగారం నిల్వలను పరిశీలిస్తున్నారు. బంగారానికి సంబంధించిన రికార్డులను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.
రుణాల ఎగవేత, నకిలీ ఇన్ వాయిస్ లతో ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెలర్స్ యాజమాన్యం మోసం చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఈడీకి చెందిన 20 టీమ్‌లు ఈ జువెలరీ షోరూంలలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
విజయవాడలోనూ
బిగ్ సీ సంస్థ కార్యాలయాలు, షోరూంలలోనూ ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ సోదాలు జరుగుతున్నాయి. హార్డ్ డిస్క్ లు, డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేశారు. బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేశారు. మరోవైపు, స్వప్న కుమార్ హోనర్ హోమ్స్‌లో భాగ్యస్వామిగా వ్యహరిస్తున్నారు. గత రెండు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హోనర్ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, నెల్లూరులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.