Chandrababu News: చంద్రబాబు ఏపీ సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి- గతంలో YSR, జగన్ కోసం సైతం!
Andhra Elections 2024: మరికొన్ని గంటల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ లో ఆయన అభిమాని నాలుక కోసుకున్నాడు.
Chandrababu fan cuts his tongue - హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి కూటమి అధికారం లోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరనున్న తరుణంలో తన అభిమాన నేత చంద్రబాబు ఏపీ సీఎం కావాలని ఆకాంక్షాస్తూ ఓ వ్యక్తి నాలుక కోసుకున్నాడు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో ఈ ఘటన కలకలం రేపింది. చంద్రబాబుకు వీరాభిమాని అయిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్.. గతంలో రెండు సార్లు ఇలాగే నాలుక కోసుకున్నానని ఓ లేఖ సైతం రాసినట్లు గుర్తించారు.
చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నాను అని రాసిన లేఖ వైరల్ అవుతోంది.
ఏపీ ప్రజలారా నాపేరు చెవల మహేష్. మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గూటల గ్రామం. నేను గతంలో అంటే 2004 -2009 సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావాలని, 2019లో వైఎస్ జగన్ సీఎం కావాలని నాలుక కోసుకుని, ఇదే వెంకటేశ్వర స్వామి గుడిలో నా మొక్కులు తీర్చుకున్నాను.
ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలవాలని చెవల మహేష్ ఆకాంక్షించాడు. కూటమి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలవాలని అతడు ఆకాంక్షించాడు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు 100 నుంచి 145 మంది ఎమ్మెల్యేలుగా గెలవాలని కోరుకుంటూ నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నాను. అదే విధంగా ఏపీలో కూటమి నుంచి 15 నుంచి 20 మంది ఎంపీలు గెలవాలని ఇట్లు మీ చెవల మహేష్ అని లేఖ రాశాడు. తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించండి ప్లీజ్ సార్ అని ఆ లేఖలో రాసుకొచ్చాడు.