Telangana News : రుణమాఫీ అయిపోయినట్లు హడావుడి - రేవంత్‌ది మోసమే - బీఆర్ఎస్ ఘాటు విమర్శలు
BRS News : రుణమాఫీ పేరుతో రైతుల్ని రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. ఎవరూ ప్రశ్నించడం లేదని మండిపడింది.
Telangana loan waiver Politis : కేబినెట్‌లో చర్చించి రుణామాఫీ చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. రూ.31 వేల కోట్లలో ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండానే దానిని పెద్దా సాయంగా రేవంత్ ప్రభుత్వం బూతద్దంలో చూపుతుందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. క్యాబినెట్ చర్చ కాగానే రుణమాఫీ చేసినట్లు ఒక సెక్షన్ మీడియా చిత్రీకరిస్తున్నదని.. పిల్ల పుట్టక ముందే మీడియా కుల్లకుడుతుందని విమర్శించారు. ఏడు నెలల తర్వాత చర్చ జరిగినందుకు సిగ్గుపడాలి .. దాని గురించి మీడియా వార్తలు రాయాలని బీఆర్ఎస్ సలహా ఇచ్చారు. ఆలు లేదు చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మీడియా తీరు ఉంది. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రోజు ఆలస్యమైతే మీడియా, మేధావులు ఒంటి కాలి మీద లేచేవారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.
రైతాంగం ఉసురుపోసుకుంటున్నా ఇప్పుడు మేధావులు నోరెత్తడం లేదు .. మీడియా ప్రభుత్వానికి మద్దతు పలుకుతుందన్నారు. డిసెంబరు 9 రుణమాఫీ అని చెప్పి .. హోల్ సేల్ గా 70 లక్షల మంది రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ వట్టి బోగస్ .. 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ అంటున్నారు.. 5 ఎకరాలు ఉన్న వారికి రూ.2 లక్షల రుణం ఏ బ్యాంకు ఇవ్వదన్న విషయం తెలియదా అని ప్రశ్నించార. అసలు ఏ క్యాటగిరీ, ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేస్తుందో ప్రభుత్వం వివరాలు విడుదల చేయాలని డిమాండ్ లచేశారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం అయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సీజన్లు అయిపోయిందన్నారు.
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ను స్థాయికి మించి దుర్భాషలాడారని.. రైతుబంధు రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇస్తానన్నాడని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూ.15 వేలు కాదు, పాత రూ.10 వేలు రైతుబంధు కు కూడా గతిలేదన్నారు. ఏరొక్క పౌర్ణమి నాటికి నదులు పారాలి కానీ.. పుణ్యాత్ములు అడుగుపెట్టిన కాలమహిమో ఏమో ఇంత వరకు నీళ్లు రాలేదన్నారు. రైతుభరోసా మార్గదర్శకాల కోసం జులై 15 వరకు గడువు పెట్టుకున్నారు .. అప్పటికి వానాకాలం సగం అయిపోతుందన్నారు.
పట్టాదారు పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు ఇచ్చామని.. కొండలు, గుట్టలకు రైతుబంధు ఇచ్చారని ఆరోపించారు. మరి ఇటీవల ఇచ్చాం అని చెప్పుకుంటున్న రైతుబంధు ఎందుకు ఇచ్చారని ప్రశఅనించారు.
68.99 లక్షల మంది రైతులకు బీఅర్ఎస్ పార్టీ 11 విడతల్లో రూ.72,815 కోట్లు ఒక్క రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
ఒక కోటి 52 లక్షల ఎకరాలకు రైతుబంధు వర్తింపచేశామని.. లోపాలను గత ఏడు నెలలలో కాంగ్రెస్ ఎందుకు సరిచేయలేదని ప్రశ్నించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 2603 క్లస్టర్లు ఉన్నాయని.. తెలంగాణ ప్రభుత్వ డాటా ఆధారంగానే కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అమలు చేసిందని గుర్తు చేశారు. కొన్ని క్లస్టర్లను ఎంపిక చేసుకుని కలెక్టర్లతో రాండమ్ గా సర్వే చేస్తే ఒక్క రోజులో పూర్తవుతుందన్నారు. ఆధునిక యుగంలో అన్ని అవకాశాలు ఉన్నా రైతులకు రైతుబంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తుందని విమర్శించారు.
రైతుభీమా, ఉచిత కరంటు, పంటల కొనుగోళ్లు, విత్తనాలు, ఎరువుల సబ్సడి, మైనర్ ఇరిగేషన్, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగానికి అండగా నిలిచామని.. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్దితో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగి దేశానికి తోడ్పాటు అందించిందన్నారు. తెలంగాణలో 92.5 శాతం భూమి 5 ఎకరాల లోపు రైతుల వద్దనే ఉంది .. 5 నుండి 6 శాతం రైతుల వద్ద పది ఎకరాల వరకు భూమి ఉందన్నారు. రుణమాఫీ, రైతుభరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల తరపున రైతులతో కలిసి పోరాడతామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.