గూగుల్ మీ డేటాను రోజుకు ఎన్నిసార్లు సేకరిస్తుందో తెలుసా? ఈ యాప్‌తో తెలుసుకోండి
ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిత్యం మనం వాడే కంప్యూటర్లు, ఫోన్లు, గాడ్జెట్స్ నుంచి డేటా సేకరిస్తుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓ యాప్ సాయంతో రోజుకు ఎన్నిసార్లు డేటా తీసుకుంటుందో తెలుసుకోవచ్చు.
పెరుగుతున్న టెక్నాలజీ మంచితో పాటు అంతే స్థాయిలో చెడును కలిగిస్తున్నది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పలు కంపెనీలు తమ యాప్ ల ద్వారా వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్నసంఘటనలు చాలా చూశాం. ఈ నేపథ్యంలో గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు మీ నుంచి డేటాను తీసుకున్న ప్రతిసారీ మిమ్మల్ని అలర్ట్ చేసే ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. మీ కంప్యూటర్ Googleకి డేటాను పంపిన ప్రతిసారీ ఈ యాప్ బీప్ సౌండ్ చేస్తుంది.
Googertellerను రూపొందించిన డచ్ డెవలపర్
ఈ అద్భుతమైన యాప్ ను డచ్ డెవలపర్ బెర్ట్ హుబెర్ట్ రూపొందించాడు. Google మన డేటాను ఎంత మొత్తంలో తీసుకుంటుంది? ఎన్నిసార్లు తీసుకుంటుంది? అనే విషయాలను బెర్ట్ తెలుసుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా.. కొంత కాలం పాటు పరిశోధన చేసి Googerteller అనే యాప్ ను రూపొందించాడు. గూగుల్ డేటాను తీసుకున్న ప్రతిసారి ఈ యాప్ బీప్ సౌండ్ చేసేలా తయారు చేశారు. బెర్ట్ హుబెర్ట్.. టెక్ రంగంలో చాలా పరిశోధనలు చేశాడు. పవర్‌డిఎన్ఎస్ డెవలపర్, ఓపెన్ సోర్స్ DNS సర్వర్ ప్రోగ్రామ్ కూడా.
Googerteller ఎలా పనిచేస్తుంది?
మీరు కనెక్ట్ చేసే IP అడ్రెస్ ను ట్రాక్ చేయడం ద్వారా Googerteller చాలా ఈజీగా పని చేస్తుంది. మీరు Googleతో అనుబంధించబడిన IP చిరునామాకు కనెక్ట్ చేసిన ప్రతిసారీ, Googerteller మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇందుకోసం బీప్ సౌండ్ చేస్తుంది. అయితే ఈ యాప్ Google క్లౌడ్‌ని పరిగణనలోకి తీసుకోదు. బ్రౌజర్‌లతో పాటు ప్రోగ్రామ్ లతో పనిచేస్తుంది. అదీ Linuxలో మాత్రమే రన్ అవుతుంది. ఈ యాప్ ను రూపొందించిన అనంతరం హుబెర్ట్ పరీక్షించారు. ఇందులో భాగంగా Google Chromeలో డచ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేశారు. అతడు సెర్చ్ బార్‌లో చిరునామాను టైప్ చేయడం ప్రారంభించిన వెంటనే, అతనికి బీప్ రావడం మొదలయ్యింది. అతడు వెబ్ సైట్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఒక్కో ట్యాబ్ ను ఓపెన్ చేసిన ప్రతి సారి బీప్ బ్దం వినిపించింది.
I made a very very simple tool that makes some noise every time your computer sends data to Google. Here a demo on the official Dutch government jobs site. The noise starts while typing the domain name already. Code, currently Linux only: https://t.co/ZjKeOSfYff pic.twitter.com/dEr8ktIGdo
— Bert Hubert 🇺🇦 (@bert_hu_bert) August 21, 2022
కేవలం Linux పరికరాల్లోనే..
అయితే, Googerteller ప్రస్తుతం Linux పరికరాలలో మాత్రమే అందుబాటులో ఉంది. Windows, Macలో ఉన్నట్లయితే ఈ యాప్ ను వినియోగించే అవకాశం లేదు. మీరు ఈ యాప్‌ను వాడేందుకు ఆసక్తి ఉంటే.. GitHub పేజీ దానిని ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది. Macలో పనిచేసే యాప్ వెర్షన్‌ని హుబెర్ట్ తయారు చేస్తున్నట్ల తెలుస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ ను కూడా రూపొందించబోతుంది. Google మిమ్మల్ని ట్రాక్ చేసిన ప్రతిసారీ బీప్ చేసే ఈ క్రియేటివ్ యాప్ గురించి మీరు ఏమనుకుంటున్నారో? చెప్పండి!
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!