Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఆగస్టులో లాంచ్ కానుంది.
శాంసంగ్ తన కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4. ఈ ఫోన్ ఆగస్టులో లాంచ్ కానుంది. అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో వచ్చిన ఫోల్డబుల్ ఫోన్ తరహాలోనే దీని డిజైన్ ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్సెసిఫికేషన్లు (అంచనా)
దీని ఫీచర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ప్రకారం ఈ ఫోన్‌లో 7.6 అంగుళాల క్యూఎక్స్‌జీఏ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని ముందు వెర్షన్ తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ అందించనున్నారు. సెకండరీ డిస్‌ప్లేగా 6.2 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్ ఉండనుంది.
16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ముందు వెర్షన్ కంటే మెరుగైన కెమెరాలు ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ అండర్ డిస్‌ప్లే కెమెరా ఉండనుంది.
ప్రస్తుతానికి శాంసంగ్ 45W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కేవలం గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫ్లాగ్ షిప్ ఫోన్‌లోనే అందించారు. ఈ ఫీచర్‌ను ఫ్లాగ్ షిప్ ఎస్-సిరీస్‌లోనే ఉంచే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌తో పాటు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram