(Source: ECI/ABP News/ABP Majha)
Realme Pad: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో బడ్జెట్ ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ ప్యాడ్.
రియల్‌మీ ప్యాడ్ మినీ మనదేశంలో లాంచ్ అయింది. రియల్‌మీ ప్యాడ్ అనేది కంపెనీ తాజాగా లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. ఇందులో 8.7 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. బడ్జెట్ విభాగంలోనే ఈ ట్యాబ్లెట్ ఎంట్రీ ఇచ్చింది.
రియల్‌మీ ప్యాడ్ మినీ ధర
ఈ ప్యాడ్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి. వైఫై ఓన్లీ వేరియంట్‌లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఎల్టీఈ వేరియంట్‌లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,999గానూ, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గానూ ఉంది. మే 2వ తేదీ నుంచి దీని సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది.
రియల్‌మీ ప్యాడ్ మినీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 8.7 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ టు బాడీ రేషియో 84.59 శాతంగా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
ట్యాబ్లెట్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఇందులో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6400 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 15.8 గంటల పాటు వీడియోను స్ట్రీమ్ చేయవచ్చు. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా... బరువు 372 గ్రాములుగా ఉంది.
View this post on Instagram