By: ABP Desam | Updated at : 30 Apr 2022 03:40 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: OnePlusI)
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. దీంతోపాటు 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న ఎన్‌డ్యూరెన్స్ ఎడిషన్ కూడా లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు.
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ధర
వన్‌ప్లస్ 10ఆర్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న 80W సూపర్‌వూక్ మోడల్ ధర రూ.38,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న 80W మోడల్ ధర రూ.42,999గా నిర్ణయించారు. ఇక 150W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న ఎన్‌డ్యూరెన్స్ మోడల్ ధర రూ.43,999గా ఉంది. ఫారెస్ట్ గ్రీన్, సియర్రా బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మే 4వ తేదీన వీటి సేల్ ప్రారంభం కానుంది.
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా... స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం 2.5డీ కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా వన్‌ప్లస్ 10ఆర్‌లో అందించారు.
12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10ఆర్ పనిచేయనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న ఆప్షన్, 5000 ఎంఏహెచ్, 150W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న ఆప్షన్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కే3పీ9 సెన్సార్‌ను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా వన్‌ప్లస్ 10ఆర్‌లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 186 గ్రాములుగా ఉంది.
Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
/body>