Aesha Mukerji on Instagram: విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు?.. షాక్‌కు గురైన అభిమానులు...ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా ఎమోషనల్ పోస్టు
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ - అయేషా ముఖర్జీ దంపతులు విడాకులు తీసుకున్నారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది.
![Aesha Mukerji on Instagram: విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు?.. షాక్‌కు గురైన అభిమానులు...ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా ఎమోషనల్ పోస్టు Shikhar Dhawan divorce: Are Shikhar Dhawan and Ayesha Mukherjee divorced? India star’s wife shares emotional post Aesha Mukerji on Instagram: విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు?.. షాక్‌కు గురైన అభిమానులు...ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా ఎమోషనల్ పోస్టు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/38eee03e234993feafa8ac7c43ed05c6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shikhar Dhawan divorce: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ - అయేషా ముఖర్జీ దంపతులు విడాకులు తీసుకున్నారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే శిఖర్ ధావన్ స్పందించాల్సిందే.
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. నిజానికి ఈ పోస్టు సోమవారమే పెట్టింది. కానీ, ఇది ఇప్పుడు అభిమానుల కంటపడి వైరల్ అయ్యింది. ప్రస్తుతం శిఖర్ ధావన్ IPL - 2021 కోసం UAE వెళ్లాడు. దిల్లీ క్యాపిటల్స్‌కి ధావన్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. నిజంగానే గబ్బర్ దంపతులు విడాకులు తీసుకున్నారా? లేక ఏదైనా ప్రమోషన్ కోసం ఇలా అయేషా ఇన్ స్టాలో పోస్టు పెట్టిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
View this post on Instagram
ధావన్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వచ్చేటప్పటికీ అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ వార్త నిజమేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
View this post on Instagram
2012లో శిఖర్ ధావన్ అయేషా ముఖర్జీని పెళ్లాడాడు. మెల్‌బోర్న్‌కి చెందిన అయేషా బాక్సర్. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ద్వారా అయేషా... ధావన్‌కి పరిచయమైంది. ధావన్‌కి అయేషా పరిచయం అయ్యే సమయానికే ఆమెకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా. 2014లో ధావన్ - అయేషా దంపతులకు జొరావర్ జన్మించాడు. అయేషా కూతుళ్లు అలియా, రియాను ధావన్ దత్తత తీసుకున్నాడు కూడా. మరి ఇప్పుడు సడెన్‌గా వీరు విడాకులు తీసుకునేందుకు కారణం ఏంటా అని తెగ వెతికేస్తున్నారు అభిమానులు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)