IPL 2025 SRH Squad Players List: మరింత పవర్‌ఫుల్‌గా సన్ రైజర్స్ హైదరాబాద్- కావ్య మారన్ సెలక్షన్ మామూలుగా లేదు!
SRH IPL Auction 2025 Squad: జెడ్డాలో IPL మెగా వేలం ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు ఏ జట్టు బలమెంతా అన్న చర్చ నడుస్తోంది. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత పవర్‌ఫుల్‌గా మారిందన్న విశ్లేషణ వినిపిస్తోంది.
Sunrisers Hyderabad List Of Players Full Team After Auction: గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్రయాణం.. అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. పరుగుల సునామీ సృష్టించి.. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఊచకోత కోసిన రైజర్స్ బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అత్యధిక రికార్డులను నెలకొల్పారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్‌తో ప్రత్యర్థి జట్లపై ఎదురుదాడికి దిగగా.. క్లాసెన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఈసారి కూడా మెగా వేలంలోనూ సన్ రైజర్స్ జట్టు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ మెగా వేలంలో పక్క వ్యూహంతో ముందుకు సాగిన సన్ రైజర్స్ హైదరాబాద్... గతంలో కంటే పటిష్టంగా కనిపిస్తోంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ సేవలను కోల్పోయినా... మరో స్టార్ పేసర్ షమీని జట్టులోకి తెచ్చుకుంది. దీంతో ఎప్పటిలాగే హైదరాబాద్ జట్టులో బౌలింగ్ బలంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న హర్షల్ పటేల్‌ను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. కమిన్స్, మహ్మద్ షమీ(Mohammed Shami), హర్షల్ పటేల్( Harshal Patel), సిమర్‌జీత్ సింగ్, ఉనద్కత్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా(Adam Zampa)తో హైదరాబాద్ బౌలింగ్ లైనప్.. పటిష్టంగా ఉంది.
హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పేది ఏముంది. హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్(Pat Cummins), అభిషేక్ శర్మ(Abhishek Sharma), ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డితో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
Also Read: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు