IPL 2025లో సరికొత్త రిటెన్షన్స్ పాలసీ - ఓ ప్లేయర్ గాయపడితే రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా!
IPL 2025 New Rules | ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే మూడు సీజన్లకుగానూ ఫ్రాంచైజీలకు సవరించిన రూల్స్ పై అధికారిక ప్రకటన ఇటీవల విడుదల చేసింది. అవగాహనా కోసం ఈ వివరాలపై ఓ లుక్కేయండి.
IPL 2025 News Updates | ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన సరికొత్త రిటెన్షన్ పాలసీ రూల్స్ ఎట్టకేలకు అధికారికంగా విడుదల చేశారు. 2025 ఐపిఎల్ సీజన్ నుండి 2027 వరకూ మూడు సీజన్లలో ఫ్రాంచైజీలు జట్టు ఎంపిక విధానంలో ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2025 IPL ఆక్షన్ పర్సు లో అదనంగా 20 కోట్లు పెంచడం ద్వారా ఈ సారి ఐపియల్ ఆక్షన్ పర్సు మూలం 120 కోట్లు గా ఉండనుంది.
సరికొత్త రిటెన్షన్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Right to Match Card (RTM): ఫైనల్ బిడ్డర్‌కు అదనపు అవకాశం
RTM కార్డు ఉపయోగించి ఫ్రాంచైజీలు తమ జట్టు ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కొత్త RTM రూల్ ప్రకారం, ఒక ఫ్రాంచైజీ తమ ఆటగాడు ఫైనల్ బిడ్డింగ్ ప్రైస్‌కు మ్యాచ్ చేయగలిగితేనే తిరిగి కొనుగోలు చేసుకో గలదు.
ఉదాహరణకు, 'ప్లేయర్ X' బిడ్డింగ్ ధర 7 కోట్లు అనుకుందాం. RTM కార్డు రూల్ ప్రకారం ఒక ఫ్రాంచైజీ తమ జట్టు ప్లేయర్ ను అంతే ధర కు RTM కార్డు ఉపయోగించి కొనుగోలు చేసుకోవచ్చు. అయితె మరో ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ కు ఫైనల్ బిడ్డింగ్ ధర 10 కోట్లు ప్రకటించింది అనుకుందాం. ఈ అవకాశం కేవలం ఒక్క సారి మాత్రమే ఉంటుంది. అప్పుడు మొదటి ఫ్రాంచైజీ RTM కార్డు ద్వారా ఆ ఆటగాడి ఫైనల్ బిడ్డింగ్ ప్రైజ్ - 10 కోట్ల ను మ్యాచ్ చెసి కొనుగోలు చేసుకోవచ్చు. అలా చెయ్యకుంటే ఎవరైతే ఎక్కువ ఫైనల్ బడ్డింగ్ ప్రైజ్ చేస్తారో వారికి ఆ ఆటగాడు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా కాకుండా ఒకవేళ ఆ 'ప్లేయర్ X' బిడ్డింగ్ ధర 7 కోట్లు అనుకున్నాం కదా. మరో ఫ్రాంచైజీ కూడా ఫైనల్ బిడ్డింగ్ ధర కేవలం 7 కోట్లు మాత్రమే ప్రకటిస్తే ఆ ప్లేయర్ ను మొదటి ఫ్రాంచైజీ తమ RTM కర్డు ఉపయోగించి రిటైన్ చేసుకోవచ్చు. RTM కార్డు రూల్ ప్రకారం ఒక ఫ్రాంచైజీ తమ జట్టు ప్లేయర్ ను అంతే ధర కు RTM కార్డు ఉపయోగించి తిరిగి కొనుగోలు చేసుకోవచ్చు.
ఒక ఫ్రాంచైజీ ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు?:
ఐపిఎల్ సరికొత్త రిటెన్షన్ రూల్స్ ప్రకారం, ఒక్కో ఫ్రాంచైజీ 6 మంది ఆటగాళ్లను రిటెన్షన్/ RTM కార్డు కాంబినేషన్ ద్వారా రిటైన్ చేసుకోవచ్చు.
గరిష్టంగా 5 మంది క్యాప్డ్ ప్లేయర్స్ (భారత, ఓవర్సీస్).
2 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ రిటేన్ చేసుకోవచ్చు.
IPL 2025 Retention Slabs:
ఒక్కో ఫ్రాంచైజీ 5 మంది క్యాప్డ్ ప్లేయర్స్ రిటైన్ చేసుకోవచ్చు. ఐపిఎల్ ఆక్షన్ పర్సు నుండి, మొదటి మూడు రిటెన్షన్‌లకు INR 18 కోట్లు, INR 14 కోట్లు, INR 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్స్‌కి INR 4 కోట్ల** రిటెన్షన్ ధర ఉంటుంది.
వచ్చే మూడు సీజన్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగింపు:
2023లో ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చే మూడు ఐపియల్ సీజన్స్ లోనూ కొనసాగించనున్నారు. ఇంపాక్ట్ రూల్ ప్రకారం
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఒక ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా నామినేట్ చేయవచ్చు. అప్పుడు అంపైర్లు ఆ ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్ సిగ్నల్ ద్వారా తుది జట్టు లో ఆడేందుకు ప్రవేశ పెడతారు. మ్యాచ్ జరుగుతున్న సమయం లో ఇన్నింగ్స్ ప్రారంభ దిశ లో కానీ, వికెట్ పడిన తర్వత కానీ, బ్యటర్ రిటైర్ అయ్యే సమయం లో కానీ, బౌలింగ్ జట్టు వికెట్ తీసిన తర్వాత కానీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంటుంది.
ఇంజూరీ రీప్లేస్‌మెంట్ రూల్‌లో సవరణలు:
2024 వరకూ, ఆటగాళ్ల గాయపడితే 7వ మ్యాచ్ లోపు రీప్లేస్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ రూల్‌లో చిన్న మార్పు చేసి, 12వ మ్యాచ్ వరకూ రీప్లేస్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
ఈ సరికొత్త ఐపియల్ రిటెన్షన్ పాలసీ రూల్స్ ద్వారా ఐపియల్ ఫ్రాంచైజీలు జట్టు ఎంపిక, ఆటగాళ్ల రిటెన్షన్, ఆక్షన్ స్ట్రాటజీలలో మరింత వ్యూహాత్మక మార్పులను అమలు పరిచే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే ఐపియల్ లో ఈ కొత్త రూల్స్ ప్రవేశ పెట్టడం తో వచ్చే ఐపియల్ ఆక్షన్ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: Rajasthan Royals Coach: రాజస్థాన్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, ఇకనైనా రాత మారుతుందా ?