IPL 2024: గిల్‌కు భారీ జరిమానా, మరోసారి చేస్తే ఓ మ్యాచ్ నిషేధమే ?
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు భారీ ఫైన్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయటంతో గిల్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించింది.
Gujrat Titans Skipper Shubman Gill Fined Rs 24 Lakh: చెన్నై సూపర్‌కింగ్స్(CSK)పై శతక గర్జన చేసి అద్భుత విజయం సాధించి మంచో జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్(GT)కు...ఐపీఎల్ (IPL)యాజమాన్యం షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు రూ. 24 లక్షల జరిమానా విధించింది. జట్టులోని సభ్యులకూ మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత పెట్టింది. జట్టు సభ్యులకు 25 శాతం కానీ రూ. 6 లక్షలు కానీ జరిమానా విధించిన ఐపీఎల్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ రెండోసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నైపై విక్టరీతో పాయింట్ల పట్టికలో గుజరాత్ 10 ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ రెండోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైంది. మరోసారి గుజరాత్ టైటాన్స్ జట్టు వచ్చేసారి ఈ పొరపాటు చేస్తే.. కెప్టెన్‌పై కూడా నిషేధం పడే అవకాశం ఉంది. గుజరాత్ మరోసారి స్లో ఓవర్ రేట్ పునరావృతం చేస్తే నిబంధనల ప్రకారం రూ.30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్ కూడా రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మొదటిసారి కెప్టెన్ కు మాత్రమే ఫైన్ వెయ్యగా ఏది రెండవసారి కావడంతో కెప్టెన్‌తో పాటు మొత్తం 11 మంది ప్లేయర్లకు కూడా ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ల ఫీజ్ లో కూడా కోత పడింది. మొత్తం 11 మంది క్రికెటర్లకు ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఈ రెండిటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని వసూల్ చేస్తారు. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై జట్టుపై 35 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిచింది. గిల్, సాయి సుదర్శన్ .. ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జట్టు 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా . పాయింట్ల టేబుల్‌లో చెన్నై 12 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది.
అదిరిపోయిన గుజరాత్ ఆట :
గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ పక్కా ప్రణాళికతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నైని 35 పరుగుల తేడాతో ఓడించి కొద్దిపాటి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ సెంచరీలతో కదం తొక్కడంతో మూడు వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 232 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది. చైన్నై జట్టులో డారిల్ మిచెల్ , మొయిన్ అలీ చెలరేగారు. చివర్లో ధోనీ ప్రేక్షకులను అలరించినప్పటికీ.. అప్పటికే లక్ష్యం అందనంత ఎత్తుకి వెళ్లిపోవడంతో చెన్నై ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ అద్భుతమైన స్పెల్‌తో చెన్నై పతనాన్ని శాసించాడు. ఆ జట్టు బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడుతూ భారీ షాట్లు కొడుతోన్న సమయంలో 3 కీలక వికెట్లు తీసి చెన్నైని కోలుకోని దెబ్బ తీశాడు. మొత్తానికి గెలుపయితే పొందారు గానీ మ్యాచ్ ఫీజులో మాత్రం పాపం భారీగా కోత పడింది.