అన్వేషించండి
Advertisement
Sakshi Malik: సాక్షి మాలిక్‌కు అరుదైన ఘనత, "టైమ్" జాబితాలో చోటు
TIMEs 100 Most Influential people: ప్రతిష్ఠాత్మక ‘టైమ్స్ 2024’ ప్రపంచ ప్రభావశీల టాప్-100 మంది వ్యక్తుల జాబితాలో ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్ చోటు దక్కించుకున్నారు.
Wrestler Sakshi Malik: టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి(Sakshi Malik) మలిక్ చోటు దక్కించుకుంది. టైమ్’ మేగజైన్(TIME Magazine) ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్‌కు చోటు దక్కడం విశేషం. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్ల పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది. WFIమాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. సహచర రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాలతో కలిసి ఈ ఆందోళనను సాక్షి కొనసాగించింది. అతనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు నిరుడు డిసెంబర్‌లో జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా గెలుపొందడంతో సాక్షి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటకు వీడ్కోలు పలికింది.
కొంతకాలం క్రితం మరోసారి సాక్షి మాలిక్ రెజ్లింగ్ పోటీల్లో బరిలోకి దిగనుందన్న వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలపై సాక్షి మాలిక్ స్పందించింది. రెజ్లింగ్ పోటీల్లో మళ్లీ పాల్గొనే అంశంపై వస్తోన్న వార్తలను మాలిక్ ఖండించింది. బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా చేస్తోన్న నిరసనలు మానసిక వేదనకు గురిచేశాయని సాక్షి మాలిక్ అన్నారు. గతేడాది డిసెంబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె.. మళ్లీ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏడాదికి పైగా గడిచిన సమయంలో తాను మానసికంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నానని సాక్షి, తమ పోరాటం విజయవంతమయ్యేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అందుకే రెజ్లింగ్‌ను మళ్లీ కొనసాగించలేనని తేల్చి చెప్పింది. తాను దేశం కోసం కాంస్యం సాధించానని... కానీ, జూనియర్లు స్వర్ణం, రజత పతకాలు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపింది. రెజ్లింగ్‌లో కొనసాగాలని తనకు చాలామంది విజ్ఞప్తి చేస్తున్నా.. బ్రిజ్ భూషణ్ వంటి వాళ్ల నడుమ రెజ్లింగ్‌ను కొనసాగించలేనని ఆమె చెప్పారు.
డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్ ఫొగాట్
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు సంజయ్ సింగ్(Sanjai Singh)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, తన సహాయ సిబ్బందికి అనవసరమైన అడ్డంకులు కలిగించడం ద్వారా తాను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్(Asian Olympic qualifying tournament) పోటీల్లో తాను పాల్గొనకుండా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. తనను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమోనని భయంగా ఉందన్నారు. రానున్న పారిస్ ఒలింపిక్స్‌లో తను ఆడకుండా అడ్డుకునేందుకు మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ , ఆయనకు డమ్మీగా ఉన్న సంజయ్ సింగ్‌లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ కోచ్‌లుగా నియమితులైన వారందరూ బ్రిజ్ భూషణ్ కు సన్నిహితులే అని, తనపై ఉన్నకోపంతో మ్యాచ్ మధ్యలో ఇచ్చే తాగునీటిలో ఏదైనా కలిపి ఇచ్చే అవకాశం ఉందంటూ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో వినేశ్ ఫొగాట్ ఆరోపించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తదితర రెజ్లర్లు తీవ్రంగా పోరాడారు. బ్రిజ్ భూషణ్ రాజీనామా తరువాత ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ విషయంపై కూడా వీరు వ్యతిరేకంగా స్పందించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
సినిమా
కరీంనగర్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion