FIFA World Cup 2022: ఫిఫా ప్రారంభ వేడుక రేపే - ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎక్కడ చూడవచ్చు?
2022 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ వేడుక ఎక్కడ చూడాలి? ఏ సమయంలో ప్రారంభం అవుతుంది?
FIFA World Cup 2022 Live: ఖతార్‌లో జరగనున్న 2022 FIFA ప్రపంచ కప్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు మరపురాని థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి మొత్తం 32 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ మెగా ఫుట్‌బాల్ టోర్నమెంట్ నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు జరగనుంది.
FIFA ప్రపంచ కప్ 2022 ఫైనల్ ఖతార్ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్ 18వ తేదీన జరుగుతుంది. FIFA ప్రపంచ కప్ 2022 మొదటి మ్యాచ్ నవంబర్ 20వ తేదీన ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్‌ల మధ్య జరుగుతుంది. ఈ కప్ ప్రారంభ వేడుక ఆదివారం నాడు జరగనుంది. భారతదేశంలో FIFA వరల్డ్ కప్ 2022 ప్రత్యక్ష ప్రసార హక్కులు Viacom18 (టీవీ వీక్షకుల కోసం Sports18 HD) దగ్గర ఉన్నాయి. అయితే టోర్నమెంట్‌ను JioCinemaలో ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.
2022 FIFA ప్రపంచ కప్ ప్రారంభ వేడుక ఎప్పుడు?
FIFA ప్రపంచ కప్ 2022 ప్రారంభ వేడుక ఆదివారం ఖతార్, ఈక్వెడార్ మధ్య టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జరుగుతుంది.
2022 FIFA ప్రపంచ కప్ ప్రారంభ వేడుక ఎప్పుడు ప్రారంభమవుతుంది?
FIFA ప్రపంచ కప్ 2022 ప్రారంభ వేడుక భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలవనుంది.
2022 FIFA ప్రపంచ కప్ ప్రారంభ వేడుక ఎక్కడ జరుగుతుంది?
FIFA వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుక అల్ ఖోర్‌లోని అల్ బైట్ స్టేడియంలో జరగనుంది.
భారతదేశంలో FIFA ప్రపంచ కప్ 2022 ప్రారంభ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?
FIFA వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని భారతదేశంలో స్పోర్ట్స్ 18లో చూడవచ్చు. అభిమానులు జియో టీవీలో ఆన్‌లైన్‌లో కూడా లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.
View this post on Instagram
View this post on Instagram