Sunil Gavaskar on Indian Flag: జాతీయ జెండాను అగౌరపరచొద్దు... ఫొటోలు వైరల్... అభిమానులను కోరిన సునీల్ గావస్కర్
టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తుంటే... మరో పక్క అభిమానులు చేసిన ఓ పనికి నెట్టింట్లో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఓవల్‌లో జరిగిన టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తుంటే... మరో పక్క అభిమానులు చేసిన ఓ పనికి నెట్టింట్లో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Video: డ్రస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం... వెల్లువెత్తిన ప్రశంసలు
అసలేం జరిగిందంటే... ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ x భారత్ మధ్య నాలుగో టెస్టు సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో టెస్టు చివరి రోజు మైదానం స్టాండ్స్‌లో భారత అభిమానులు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ కనిపించారు. ఈ క్రమంలో జాతీయ జెండాను పలువురు అభిమానులు చేతులతో పైకెత్తి కలియ తిరిగారు. ఆ సమయంలో జెండాపై ‘WE Bleed Blue’ అని రాసి ఉంది. ఈ మ్యాచ్‌కి భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో గావస్కర్ స్టేడియంలో జాతీయ జెండాపై ఏదో రాసి ఉండటాన్ని గమనించాడు. వెంటనే అతడు కామెంటరీ బాక్స్ నుంచే జాతీయ జెండాను అగౌరపరచొద్దు. నువ్వు ఎంత పెద్ద అభిమానివి అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు’ అని కోరాడు.
Sunil Gavaskar to fans : Show your love for the country but don't deface the flag by writing anything on it.
— Roshan Rai (@ItsRoshanRai) September 6, 2021
What a legend.#INDvENG #ENGvIND
ఇది విన్న అభిమానులు నెట్టింట్లో దీనిపై విచారం వ్యక్తం చేశారు. ‘జాతీయ జెండాను గౌరవించడం మన హక్కు, జాతీయ జెండాపై ఇలా రాయడం సరికాదు’ అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jasprit Bumrah Record: బుమ్ బుమ్ బుమ్రా @ 100... కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 157 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ 2 - 1 ఆధిక్యంలో నిలిచింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి టెస్టు మాంచెస్టర్ వేదికగా ఈ నెల 10న ప్రారంభంకానుంది. ఓవల్ మైదానంలో విజయం కోసం 50 ఏళ్లుగా ఎదురుచూసిన టీమిండియా నిరీక్షణకు తాజా విజయంతో తెరపడింది.