Pele Health Update: నాకు శస్త్ర చికిత్స జరిగింది.. ఈ మ్యాచ్ ని చిరునవ్వుతో ఎదుర్కొన్నా.. ఫుట్ బాల్ దిగ్గజం పీలే
ప్రముఖ సాకర్ దిగ్గజం, బ్రెజిల్ కు చెందిన పీలే పెద్ద పేగుకు ఉన్న కణితిని తొలగించారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యం ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
![Pele Health Update: నాకు శస్త్ర చికిత్స జరిగింది.. ఈ మ్యాచ్ ని చిరునవ్వుతో ఎదుర్కొన్నా.. ఫుట్ బాల్ దిగ్గజం పీలే Pele health update Brazilian footballer says apparent colon tumor removed but feels well Pele Health Update: నాకు శస్త్ర చికిత్స జరిగింది.. ఈ మ్యాచ్ ని చిరునవ్వుతో ఎదుర్కొన్నా.. ఫుట్ బాల్ దిగ్గజం పీలే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/6e1f84a514736899575f72cade4b233f_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పీలే గత వారం సాధారణ పరీక్షల కోసం సావ్ పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే పరీక్షల్లో ఆయనకు కణితి ఉన్నట్టు గుర్తించారు డాక్టర్లు. పెద్ద పేగుకు ఉన్న కణితిని వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఇంటెన్సివ్ కేర్ నుంచి సాధారణ గదికి పంపినట్లు చెప్పారు. పీలే 2012లో తొడ ఎముకకు సంబంధించిన ఆపరేషన్ ను చేయించుకున్నారు. అయితే దాని తర్వాత.. ఆయన వీల్ చైర్ ఉపయోగించాల్సి వచ్చింది. కొన్ని రోజులు మూత్రపిండాల సమస్యతో కూడా బాధపడ్డాడు ఈ ఫుట్ బాల్ దిగ్గజం.
Also Read: Avani lekhara: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..
Ind vs Eng, 4th Test: మరో మైలురాయిని చేరిన కోహ్లీ.. కానీ సచిన్, ద్రవిడ్ కన్నా కాదు!
అయితే శస్త్రచికిత్స విజయవంతంపై పీలే స్పందించారు. ఈ ఆపరేషన్ 'గొప్ప విజయం' అని పీలే తన సోషల్ మీడియా చెప్పారు. 'నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత శనివారం పెద్దపేగులో కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. సాధారణ పరీక్షల కోసం వెళ్లినప్పుడు ఈ కణితిని గుర్తించారు.' అని పీలే చెప్పారు.
Guys, I didn't faint and I'm in very good health. I went for my routine exams, which I had not been able to do before because of the pandemic. Let them know I don't play next Sunday! 👍🏽
— Pelé (@Pele) August 31, 2021
Also Read: ICC T20 World Cup: ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే పాకిస్థాన్ జట్టిదే... ప్రకటించిన పాకిస్థాన్... ఆ కొద్దిసేపటికే కోచ్‌లు రాజీనామా
ENG vs IND 2021: స్టాండ్స్‌లో ఒంటరిగా అశ్విన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్... నెట్టింట్లో రచ్చ రచ్చ
'అదృష్టవశాత్తూ, నేను మీతో పాటు గొప్ప విజయాలు జరుపుకోవడం అలవాటు చేసుకున్నాను. నేను ఈ మ్యాచ్‌ని నా ముఖం మీద చిరునవ్వుతో ఎదుర్కొంటాను. నా కుటుంబం, స్నేహితుల ప్రేమతో జీవించడంపై ఆశతో ఉన్నాను.' అని అంతకుముందు పీలే సోషల్ మీడియాలో తెలిపారు.
1956 లో ఫుట్ బాల్ కెరీర్ ప్రారంభించిన పీలే 1977 వరకు ఆడారు. 2014లో గ్లోబల్ ఫుట్ బాల్ అంబాసిడర్ గా ఆయన సేవలందించారు. పీలే 1958, 1962 మరియు 1970 వరల్డ్ కప్‌లను గెలుచుకున్నాడు. 77 తో బ్రెజిల్ ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు.
Jasprit Bumrah Record: బుమ్ బుమ్ బుమ్రా @ 100... కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)