అన్వేషించండి

Pat Cummins: మరవను, మర్చిపోలేను- విరాట్‌ వికెట్టే బౌలర్ కెరీర్ లో అద్భుత క్షణం

ODI World Cup 2023:  ప్రపంచకప్‌ ఫైనల్లో విరాట్‌ కోహ్లీ వికెట్టే తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కమిన్స్‌ చెప్పాడు. తాను జీవితం చివరి రోజుల్లో ఉన్నప్పుడు కూడా విరాట్‌ వికెట్‌ తనకు గుర్తుస్తుందన్నాడు.

భారత్‌(Bharat) వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023(World Cup 2023)లో భారత్‌పై ఆస్ట్రేలియా(Sudtrelia) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది జరిగి సమయం గడుస్తున్నా అభిమానుల మదిలో నుంచి ఈ చేదు జ్ఞాపకాలు పోవడం లేదు. ఈ ఓటమితో ప్రపంచంలోనే ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను ఈ ఓటమి కలచివేసింది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ల ముందు తలవంచింది. ఈ ఓటమి ఆటగాళ్ల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. అయితే ప్రపంచకప్‌ ఫైనల్లో విరాట్‌ కోహ్లీ వికెట్టే మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పింది. ఆస్ట్రేలియా సారధి ప్యాట్‌ కమిన్స్‌ వేసిన బంతిని కోహ్లీ డిఫెన్స్‌ ఆడగా అది బ్యాట్‌కు తగిలి వెళ్లి వికెట్లకు తగిలింది. దీంతో విరాట్‌ కోహ్లీ తీవ్ర ఆవేదనతో మైదానాన్ని వీడాడు. దీనిపై తొలిసారి ప్యాట్‌ కమిన్స్‌ స్పందించాడు. విరాట్‌ వికెట్‌ తన జీవిత చరమాంకంలో గుర్తుస్తుందని... ప్రపంచకప్‌లో తనకు అవే అద్భుత క్షణాలనీ చెప్పేశాడు.


 ప్రపంచకప్‌ ఫైనల్లో విరాట్‌ కోహ్లీ వికెట్టే తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కమిన్స్‌ చెప్పాడు. తాను జీవితం చివరి రోజుల్లో ఉన్నప్పుడు కూడా విరాట్‌ వికెట్‌ తనకు గుర్తుస్తుందని అన్నాడు. 70ఏళ్లు దాటిన తర్వాత భారత్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ క్షణాల గురించి ఆలోచిస్తారని ఓ విలేకరి కమిన్స్‌ను ప్రశ్నించాడు. అప్పుడు కమిన్స్‌ అది విరాట్‌ వికెట్టేనని తేల్చి చెప్పేశాడు. తన జీవితంలో అత్యంత అద్భుతమైన, కీలకమైన క్షణం అదే అని తెలిపాడు. విరాట్‌ వికెట్‌ తీసిన సమయంలో తనకు చాలా ఆనందంగా అనిపించిందని అన్నాడు. తాను వికెట్‌ తీసినప్పుడు స్టీవ్‌ స్మిత్‌ తన దగ్గరికి వచ్చి ఒకసారి మైదానాన్ని చూడమని చెప్పాడు. అప్పుడు మైదానమంతా నిశ్బబ్దం ఆవరించిందని కమిన్స్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణాలను తాను చాలా కాలం పాటు ఆస్వాదిస్తానని కమిన్స్‌ అన్నాడు. 


 ఆస్ట్రేలియా(Austrelia) క్రికెట్‌(Cricket)  జట్టుకు ఈ ఏడాది స్వర్ణ యుగమనే చెప్పాలి. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా కంగారులు వన్డే ప్రపంచకప్‌(World cup) ను కూడా కైవసం చేసుకున్నారు. ఫైనల్లో అద్భుత ఆటతీరుతో భారత్‌(Bharat)ను కంగుతినిపించి ఆరోసారి ప్రపంచ కప్‌ను సాధించారు. అయితె ప్యాట్ కమిన్స్‌ నేతృత్వంలోని జట్టు ఈ ఏడాది అద్భుతమే చేసింది. ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా టెస్ట్ ఛాంపియన్ షిప్‌, వన్డే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఆస్ట్రేలియా చిరస్మరణీయం చేసుకుంది.


ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ప్యాట్‌ కమిన్స్ సేన చిత్తు చేసింది. అది కూడా ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై జరిగిన యాషెస్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. గతంలో యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా దగ్గరే ఉండటంతో ఇప్పుడు కూడా వాళ్ల దగ్గరే యాషెస్ ట్రోఫీ భద్రంగా ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరినా ఓటమి పాలైంది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను సొంతగడ్డపైనే ఫైనల్లో ఓడించి సగర్వంగా కప్పును ముద్దాడింది. ఇలా ఒకే ఏడాది మూడు ప్రతిష్టాత్మక టోర్నీల్లో రాణించి ఆస్ట్రేలియా 2023ను గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget