CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Andhra News: బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్ మీట్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సరదాగా థగ్ ఆఫ్ వార్ ఆడారు.
CM Chandrababu And Nara Lokesh Thug Of War: ఏపీవ్యాప్తంగా 45 వేల పైచిలుకు స్కూళ్లలో శనివారం మెగా పేరెంట్ - టీచర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu), విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర సన్నివేశం జరిగింది. పేరెంట్స్‌తో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు స్కూల్‌ను పరిశీలించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో తండ్రీకొడుకులు సరదాగా థగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. చంద్రబాబు వైపు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అధికారులు ఉండగా.. లోకేశ్ వైపు ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. చివరకు సీఎం చంద్రబాబు జట్టు విజయం సాధించింది. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం పేరెంట్స్, విద్యార్థులు, టీచర్స్‌తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని.. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. 'విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
నమాజ్ వినిపించగానే..
ఆత్మీయ సమావేశంలో విద్యార్థులు ప్రసంగం అనంతరం సీఎం చంద్రబాబు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో స్థానికంగా నమాజ్ వినిపించగానే.. ప్రసంగం ఆపేశారు. నమాజ్ పూర్తైన అనంతరం తన ప్రసంగం కొనసాగించారు.
ప్రసంగం మధ్యలో నమాజ్ వినిపించగానే, ప్రసంగం ఆపేసి, మత విశ్వాసాలని గౌరవించిన చంద్రబాబు గారు#MegaParentTeacherMeeting #ChandraBabuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/LTKKui2wWR
— Telugu Desam Party (@JaiTDP) December 7, 2024
పేరెంట్స్‌కు మెసేజ్‌లు
తల్లిదండ్రులు నైతిక విలువలతో పిల్లలను పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. భారతదేశ గొప్ప సంపద కుటుంబ వ్యవస్థని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసి విద్యార్థులను ప్రయోజకులను చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 'తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల చదువును నిర్లక్ష్యం చెయ్యొద్దు. పిల్లలు స్కూల్‌కు రాకపోతే వారి పేరెంట్స్ ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్ వస్తాయి.' అని సీఎం పేర్కొన్నారు.
పిల్లలు స్కూలు రాకపోతే ఫోన్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌లు వస్తాయి. మీ పనుల్లో మీరుండి పిల్లల చదువును నిర్లక్ష్యం చేయవద్దు.#MegaParentTeacherMeeting #ChandraBabuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/P8eSSuoEGQ
— Telugu Desam Party (@JaiTDP) December 7, 2024
'6 నెలల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ'
అటు, అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామని మంత్రి లోకేశ్ అన్నారు. మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని.. 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందన్నారు.