Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Toyota Innova Hycross Price Hike: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ధరను కంపెనీ పెంచనుంది. వేరియంట్‌ను బట్టి రూ.19.94 లక్షల నుంచి రూ.31.34 లక్షల వరకు దీని ధర ఉంది.
Toyota Innova Hycross New Price: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒక ఎంపీవీ కారు. ఈ కారు ధరను కంపెనీ ఇటీవలే పెంచింది. ఇన్నోవా హైక్రాస్ ధర ఏకంగా రూ.36 వేల వరకు పెరిగింది. కారు ధర పెరిగిన తర్వాత ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.19.94 లక్షల నుంచి ప్రారంభమై రూ.31.34 లక్షలకు చేరుకుంది.
పెరిగిన ఇన్నోవా ధర
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆరు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు జీఎక్స్, జీఎక్స్(వో), వీఎక్స్, వీఎక్స్(వో), జెడ్ఎక్స్, జెడ్ఎక్స్(వో) వేరియంట్‌లు భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ వేరియంట్‌లు జీఎక్స్, జీఎక్స్(వో) ధర రూ. 17,000 పెరిగింది. ఈ కారు మిడ్ వేరియంట్ వీఎక్స్, వీఎక్స్(వో) ధర రూ.35,000 పెరిగింది. ఇన్నోవా టాప్ మోడల్స్ జెడ్ఎక్స్, జెడ్ఎక్స్(వో) ధర ఏకంగా రూ.36,000 పెరిగింది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
ఇన్నోవా వెయిటింగ్ పీరియడ్ ఎంత?
మీడియా నివేదికల ప్రకారం ఇన్నోవా హైక్రాస్ వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది. ఈ వాహనం పెట్రోల్ వేరియంట్ కోసం మీరు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అదే టాప్ వేరియంట్‌లను బుక్ చేసుకుంటే ఆరు నెలల తర్వాత ఈ వాహనం మీకు లభిస్తుంది. మరోవైపు మీరు పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ కోసం 45 రోజులు వేచి ఉండాలి. గత నెల వరకు ఈ వాహనం వెయిటింగ్ పీరియడ్ ఎనిమిది నెలలకు చేరుకుంది.
ఇన్నోవా హైక్రాస్ ఇంజిన్ ఎలా ఉంది?
టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది. కారులోని ఈ ఇంజన్ 172 హెచ్‌పీ పవర్‌ని అందిస్తుంది. ఈ ఇంజన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఇన్నోవా హైబ్రిడ్ టెక్నాలజీతో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇది 184 హెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది.
ఇన్నోవా సెవెన్ సీటర్, ఎయిట్ సీటర్ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. ఈ కారులో భద్రత కోసం ఆరు ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. ఈ కారు ఏడు కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
Thanks to your trust and support, we achieved the #Awesome milestone of 1 lakh sales of Toyota #InnovaHycross as we celebrate its second year anniversary. Here's to many more milestones. #ToyotaIndia pic.twitter.com/oWJnHGO07D
— Toyota India (@Toyota_India) November 23, 2024
The #InnovaHyCross redefines mobility using the latest 5th Gen Self-charging Hybrid Electric Technology for a clean, efficient, and powerful driving experience. Know More: https://t.co/fJ1d8SpYk0 #ToyotaIndia #Awesome pic.twitter.com/6hyug8ag1s
— Toyota India (@Toyota_India) November 12, 2024