Best Budget CNG Cars: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
Best CNG Cars: మనదేశంలో రూ.10 లక్షల్లోపు సీఎన్‌జీ కార్లు చాలా ఉన్నాయి. కానీ వీటిలో బెస్ట్ కార్లు అని చెప్పుకోదగ్గవి మాత్రం కొన్నే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Best CNG Cars Under 10 Lakh Rupees: పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో సీఎన్‌జీ కారు ప్రజలకు ఒక వరంలా ఉంటుంది. మీ బడ్జెట్ రూ. 10 లక్షలుగా ఉండి మీరు మెరుగైన సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మార్కెట్లో ఈ రేంజ్‌లో చాలా మంచి ఆప్షన్లు ఉన్నాయి.
మారుతి సుజుకీ ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10 CNG)
ఆల్టో కే10ని భారత మార్కెట్లో అత్యంత చవకైన సీఎన్‌జీ కారు అని చెప్పవచ్చు. మంచి మైలేజీ అందించే ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూం ధర కేవలం రూ. 5.73 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఆన్ రోడ్‌కు వచ్చేసరికి ఇది ఆరు లక్షలకు కొంచెం అటూ ఇటుగా ఉండవచ్చు.
ఆల్టో కే10 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ సీఎన్‌జీ మోడ్‌లో 56 హెచ్‌పీ పవర్, 82.1 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఈ కారు 33.85 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.
టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. పంచ్ ఐసీఎన్‌జీ అనేది ఐకానిక్ ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఇది అత్యుత్తమ సెక్యూరిటీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. ఈ కారులో ఐసీఎన్‌జీ కిట్ ఉంది. ఇది కారును లీకేజీ నుంచి కాపాడుతుంది. కారులో ఎక్కడైనా గ్యాస్ లీక్ అయితే ఈ టెక్నాలజీ సాయంతో ఆటోమేటిక్ గా కారు సీఎన్‌జీ మోడ్ నుంచి పెట్రోల్ మోడ్ లోకి మారుతుంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే - నెక్సాన్ నుంచి సోనెట్ వరకు!
టాటా పంచ్‌లో సెక్యూరిటీ కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. దీంతో పాటు కారులో వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ కూడా ఉంది. ఈ టాటా కారులో ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు. ఈ కారు ఐదు కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. టాటా పంచ్ సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధర రూ.7,22,900 నుంచి ప్రారంభం అవుతుంది.
మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ (Maruti Swift CNG)
మారుతి స్విఫ్ట్ ఇటీవలే సీఎన్‌జీ వేరియంట్‌లో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారు జెడ్-సిరీస్ ఇంజిన్, ఎస్-సీఎన్‌జీ కలయికను కలిగి ఉంది. దీని కారణంగా ఈ కారు 32.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ మూడు వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. దాని బేస్, మిడ్ వేరియంట్‌ల్లో స్టీల్ వీల్స్ ఉపయోగించారు. అయితే టాప్ వేరియంట్‌లో పెయింట్ చేసిన అల్లాయ్ వీల్స్ ఇన్‌స్టాల్ చేశారు.
మారుతి స్విఫ్ట్ స్మార్ట్‌ప్లే ప్రోతో 17.78 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ కారులో యూఎస్‌బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. ఈ కారు టాప్ వేరియంట్‌లో రియర్ ఏసీ వెంట్లు అందించారు. ఈ మారుతి కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.19 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: హీరో స్ప్లెండర్ వర్సెస్ హోండా షైన్ - రెండు మైలేజీ బైక్‌ల్లో ఏది బెస్ట్?