Best SUV Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లో బెస్ట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే - నెక్సాన్ నుంచి సోనెట్ వరకు!
Best Sub Compact SUV in India: ప్రస్తుతం మనదేశంలో రూ.10 లక్షల్లోపు బెస్ట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. టాటా నెక్సాన్ నుంచి ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వరకు చాలా కార్లు ఇందులో ఉన్నాయి.
SUV Under 10 Lakh: భారత మార్కెట్లో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఎస్‌యూవీలు స్పోర్ట్ యుటిలిటీ వాహనాల చిన్న వెర్షన్లు. ఈ ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్ కారణంగా చాలా మంది వాహన తయారీ కంపెనీలు ఈ విభాగంలో అనేక కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. భారతదేశంలో ఇటువంటి అనేక ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో టాటా, కియా నుంచి హ్యుందాయ్, మహీంద్రా వరకు కార్లు ఉన్నాయి. భారతదేశంలో రూ.10 లక్షల రేంజ్‌లో అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.
టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్ 2017 సంవత్సరంలో లాంచ్ అయింది. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఈ టాటా కారు మొత్తం 100 వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఐదు రంగుల్లో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ కారులో ఆర్16 అల్లాయ్ వీల్స్ అందించారు. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
కియా సోనెట్ (Kia Sonet)
కియా సోనెట్ అనేది ఫైవ్ సీటర్ కారు. ఈ కార్లు రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇందులో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. కారులో ఫ్రంట్ ఫాసియా ఏసీ వెంట్స్ ఉన్నాయి. దీంతో పాటు పూర్తి డిజిటల్ క్లస్టర్ కూడా అందించారు. ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ నేవిగేషన్ సిస్టమ్ ఉంది. కియా సోనెట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
హ్యుందాయ్ వెన్యూ... కియా సోనెట్ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారు అయింది. ఈ కారు మూడు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. వీటిలో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ కారు 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో కూడా వస్తుంది. దీంతో పాటు హ్యుందాయ్ కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఫైవ్ సీటర్ కారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7.94 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV 3XO)
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కూడా మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 82 కేడబ్ల్యూ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 96 కేడబ్ల్యూ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. 230 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 86 కేడబ్ల్యూ పవర్, 300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Also Read: స్కోడా కైలాక్ రేటు రివీల్ అయ్యేది అప్పుడే - డెలివరీ ఎప్పుడు వస్తుంది?