పెట్రోల్ కారులో డీజిల్ పట్టిస్తే ఏం జరుగుతుంది? పెట్రోల్ కారులో డీజిల్ పట్టిస్తే ఇంజిన్ పాడయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ప్రాపర్టీస్ వేర్వేరుగా ఉంటాయి. డీజిల్‌ను పెట్రోల్ కారులో పట్టించడం వల్ల కారు కనీసం స్టార్ట్ కూడా అవ్వదు. ఒకవేళ కారు రన్నింగ్‌లో ఉంటే ఇంజిన్ వెంటనే ఆగిపోతుంది. ఒకవేళ ఇంజిన్ ఆన్ అయినా కారును అలా నడిపితే ఇంజిన్ పాడవుతుంది. ఎందుకంటే డీజిల్‌లో ల్యూబ్రికేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని కారణంగా డీజిల్ తక్కువగా మండుతుంది. పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ కొత్తగా ఉంటుంది. అలాగే డీజిల్ ఇంజిన్‌లో స్పార్క్ అస్సలు ఉండదు. ఒకవేళ పొరపాటున పెట్రోల్ కారులో డీజిల్ పట్టిస్తే వెంటనే కారును ఆపేసి మెకానిక్‌తో డీజిల్ తీయించడం ఉత్తమం.