మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎంత మైలేజీ ఇస్తుంది? మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో అనేది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్స్‌లో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందించడం విశేషం. భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. అలాగే ఈ కారులో స్కై రూఫ్ ఫీచర్‌ను కూడా కంపెనీ అందించింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 7 స్పీకర్ హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టంను ఇందులో చూడవచ్చు. ఈ కారు మైలేజీ 18.06 కిలోమీటర్ల నుంచి 21.2 కిలోమీటర్ల మధ్యలో ఉండనుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూం ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది.