Natasa Stankovic: బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ మాజీ భార్య చక్కర్లు , విడిపోవడానికి అతడే కారణమట!
Natasha’s Friend: సెర్బియాలో దాదాపు రెండు నెలలు గడిపిన తర్వాత తాజాగా భారతదేశానికి తిరిగి వచ్చిన నటి-మోడల్ నటాషా స్టాంకోవిక్ ముంబై వీధుల్లో స్నేహితుడు అలెగ్జాండర్ ఇలాక్ తో కనిపించింది.

Natasha Was Seen With Her Friend Alexander In A Car In Mumbai: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా(Hardic Pandya) మాజీ భార్య నటాషా స్టాంకోవిక్(Natasha) రెండు నెలల తర్వాత ముంబైలో అడుగుపెట్టింది. తన బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్‌తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది. నాలుగేళ్ల వివాహ బంధానికి హార్దిక్ – నటాషా ఇటీవలే ముగింపు పలికారు. తర్వాత కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సొంత దేశం సెర్బియా వెళ్లిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా చక్కర్ల వీడియో వైరల్‌గా మారింది. సెర్బియాలో దాదాపు రెండు నెలలు గడిపిన తర్వాత ఇటీవలే ముంబైకు వచ్చిన హార్దిక్ భార్య... తన ప్రాణ స్నేహితుడు అలెగ్జాండర్ ఇలాక్(Alexander Ilic)తో కలిసి చక్కర్లు కొట్టింది. ఈ టూర్ వీడియోనూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. నటాషా కారు నడుపుతుండగా... బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ పక్కనే కూర్చున్నాడు. ఈ అలెగ్జాండర్ అసలు ఎవరు అనే దానిపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా రకరకాల పోస్టులు పెడుతున్నారు. భారత జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత తొలిసారి ముంబైకి వచ్చిన నటాషా.. హార్దిక్ ని కలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన ప్రాణ స్నేహితుడు అలెగ్జాండర్‌తో కలిసి నటషా కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ ఆమె అతడితో కలిసి చక్కర్లు కొట్టింది. నటాషా, హార్దిక్ విడిపోవడానికి ఈ అలెగ్డాండరే కారణమని సోషల్ మీడియాలో హార్దిక్ అభిమానులు కామెంట్లు పడుతున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

