క్రిస్ హారీస్ న్యూజిలాండ్‌కు చెందిన కీలక బౌలర్.. 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ ప్లేయర్ జెర్సీ నెంబర్ 5ను కూడా కివీస్ బోర్డు రిటైర్ చేసింది.
న్యూజిలాండ్‌కు చెందిన ఆస్టిల్ జెర్సీని కూడా రిటైర్ చేశారు. టెస్ట్ క్రికెట్‌లో అతను సాధించిన ఘనతల గౌరవార్థం జెర్సీ నెంబర్ 9ని రిటైర్ చేశారు.
న్యూజిలాండ్‌కు చెందిన ఈ స్పిన్నర్... కివీస్ గెలిచిన చాలా మ్యాచుల్లో కీలక పాత్ర పోషించాడు. దానికి గుర్తుగా వెటోరి జెర్సీ నెంబర్ 11ను రిటైర్ చేశారు.
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కివీస్ కెప్టెన్‌గా కీలక విజయాల్లో పాలుపంచుకున్నాడు. 2000 సంవత్సరంలో కివీస్‌కు నాకౌట్ ట్రోఫీని అందించాడు. అందుకే ఫ్లెమింగ్ జెర్సీ నెంబర్ 7ను రిటైర్ చేశారు.
న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్. ఐపీఎల్‌లొ తొలి సెంచరీ కొట్టిన పోటుగాడు. కివీస్ జట్టుకు చేసిన సేవలకు గుర్తుగా మెక్‌కల్లమ్ ధరించే 42వ నెంబర్ జెర్సీకి న్యూజిలాండ్ బోర్డు రిటైర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మ్యాచ్ ఆడుతుండగా బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలిన ఫిలిప్ హ్యూస్ గౌరవార్థం అతడి జెర్సీ 64ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రిటైర్ చేసింది.
నేపాల్ ఆటగాడు పరాస్ ఖడ్కాకు రిటైర్‌మెంట్ తర్వాత ఓ అరుదైన గౌరవం దక్కింది. అతను సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సమయంలో అతడు ధరించిన జెర్సీ నెంబర్ 77ను నేపాల్ బోర్డు రిటైర్ చేసింది.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్న సచిన్.. పదో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగేవాడు. అందుకే ఈ దిగ్గజ ఆటగాడి రిటైర్‌మెంట్ అనంతరం ఆ జెర్సీను కూడా రిటైర్ చేశారు.
మిస్టర్ కూల్, భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగేవాడు. క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తుగా ఆ జెర్సీని కూడా రిటైర్ చేశారు.
మరో కివీస్ ఆటగాడు క్రిస్ కెయిన్స్ జెర్సీని కూడా రిటైర్ చేశారు. న్యూజిలాండ్ జట్టులోకీ కీలక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పౌందిన కెయిన్స్ 6 నెంబర్ జెర్సీని రిటైర్ చేశారు.