రాహుల్ ద్రవిడ్‌కి పుత్రోత్సాహం రాహుల్ ద్రవిడ్‌కు ఇద్దరు పిల్లలు ఒకరు సమిత్ ద్రవిడ్ రెండోవాడు అన్వయ్ ద్రవిడ్ సమిత్ ద్రవిడ్ , అన్వయ్ ద్రవిడ్ ఇద్దరు కూడా క్రికెట్‌లో రాణిస్తున్నారు. సమిత్ ద్రవిడ్ అండర్ 19 టీంలో ఆడబోతున్నాడు. అన్వయ్ ద్రవిడ్ కర్నాటక క్రికెట్ టీం కెప్టెన్‌గా చేశాడు ఆస్ట్రేలియాతో జరగబోయే అండర్-19 మల్టీ ఫార్మట్ సిరీస్‌కు సమిత్ ఎంపికయ్యాడు. వన్డే, టెస్టు జట్లలో సమిత్‌కు ఛాన్స్ చెన్నై, పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియాతో మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు, 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయి. కేఎస్సీఏ మహారాజా టీ20 ట్రోఫీలో మైసూరు వారియర్స్ తరపున బరిలోకి దిగిన ఆకట్టుకున్నాడు. మీడియం పేస్ బౌలింగ్ కూడా సమిత్ చేయగలగడం ప్లస్ అయింది. బెహార్ ట్రోఫీలో 8 మ్యాచులు ఆడి 362 పరుగులు చేసి 16 వికెట్లు తీశాడు.