వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అదరగొట్టిన ఆటగాళ్ళు ఎవరంటే.. సచిన్ వన్డే కెరీర్‌లో 452 ఇన్నింగ్స్‌లు. 18,426 పరుగులు. 44.83 బ్యాటింగ్ సగటుతో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు. విరాట్ కోహ్లీ కెరీర్‌లో 282 ఇన్నింగ్స్‌లు. 13,886 పరుగులు. 58.34 సగటుతో 50 సెంచరీలు,72 హాఫ్ సెంచరీలు. గంగూలీ వన్డే కెరీర్‌లో 297 ఇన్నింగ్స్‌లు. 40.95 బ్యాటింగ్ సగటుతో మొత్తం 11,221 పరుగులు. 22 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు. రోహిత్ శర్మ 256 ఇన్నింగ్స్ ఆడాడు. 49.23బ్యాటింగ్ సగటుతో 10,831 పరుగులు చేశాడు. 31 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు. రాహుల్ ద్రావిడ్ మొత్తం 314 ఇన్నింగ్స్ ఆడాడు. 39.15 బ్యాటింగ్ సగటుతో 10,768 పరుగులు చేశాడు. 12 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు. ధోని 294 వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. 50.23 బ్యాటింగ్ సగటుతో 10,599 పరుగులు చేశాడు. 9 సెంచరీలు,73 హాఫ్ సెంచరీలు మహ్మద్ అజారుద్దీన్ 308 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడి 36.92బ్యాటింగ్ సగటుతో 9,378 పరుగులు చేశాడు. 7 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు. యువరాజ్ సింగ్ 275 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడాడు.36.47బ్యాటింగ్ సగటుతో 8,609 పరుగులు చేశాడు. 4 సెంచరీలు,52 హాఫ్ సెంచరీలు.