అన్వేషించండి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 17 మంది మావోయిస్టులు హతం!

Bijapur Encounter | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు హతమయ్యారని సమాచారం. 12 మంది మృతిని అధికారులు నిర్ధారించారు.

Chhattisgarh Encounter News: బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లింది. దక్షిణ బస్తర్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉసూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అయితే 12 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ (Bijapur Encounter) జరిగిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకూ పోలీసులు, భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు.

దండకారణ్యంలో మరోసారి కాల్పులమోత

పూజారి కాంకేర్‌- మారేడుబాక అడవుల్లో మావోయిస్టులు  సమావేశం అయ్యారన్న సమాచారంతో బీజాపూర్, సూక్మా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.  డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌), కోబ్రా టీమ్, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కనిపించడంతో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇటీవల ఐఈడీ పేల్చివేసిన మావోయిస్టులు

జనవరి 6న బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీతో వాహనం పేల్చివేయగా 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ఘటనతో బీజాపూర్, బస్తర్ ప్రాంతంలో పోలీస్ బలగాలు మావోయిస్టులు అమర్చిన మందు పాతర్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కోబ్రా టీమ్, సీఆర్పీఎఫ్ టీమ్స్ అప్రమత్తం అయ్యా్యి. మావోయిస్టుల ఏరివేతకు బస్తర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు బీజాపూర్ జిల్లా పుత్కేల్ అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలిన ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఉత్తర బస్తర్ డివిజన్ టెక్నికల్ ఏరియా కమాండర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొండగావ్ జిల్లా ఎస్పీ అక్షయ్ కుమార్ ఎదుట కీలక మావోయిస్టు  గిజ్రురమ్‌ ఉసెండి గురువారం లొంగిపోయాడు. అతడి మీద రూ. 5 లక్షల రివార్డ్ సైతం ఉంది.

Also Read: Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget