![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Justin Langer: ఇండియాలో వెయ్యి రెట్లు రాజకీయాలు, అది నావల్ల కాదు: జస్టిన్ లాంగర్
Justin Langer Comments: ఇండియన్ కోచ్ పదవంటే విపరీతమైన రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కే ఎల్ రాహుల్ తనతో చెప్పినట్లు జస్టిన్ లాంగర్ చెప్పడంతో పెను దుమారం రేగింది.
![Justin Langer: ఇండియాలో వెయ్యి రెట్లు రాజకీయాలు, అది నావల్ల కాదు: జస్టిన్ లాంగర్ Australian cricket coach Justin Langer says he dont want 1000 times more politics as an indian coach Justin Langer: ఇండియాలో వెయ్యి రెట్లు రాజకీయాలు, అది నావల్ల కాదు: జస్టిన్ లాంగర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/6578a4371bbe56a95bdb788b5fe1f56317165477432481015_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cricket News Latest: ఇండియన్ క్రికట్ టీమ్ ప్రధాన కోచ్ పదవి రేసు నుంచి ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ జస్టిన్ లాంగర్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. గుజరాత్ టైటన్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఈ విషయమై హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ హెడ్ కోచ్ పదవంటే విపరీతమైన రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాహుల్ తనతో చెప్పినట్లు లాంగర్ చెప్పడంతో పెను దుమారం రేగింది.
అసలు కథేంటంటే..
ఇండియా టీమ్ ప్రధాన కోచ్ పోస్టుకు రేసులో ఉన్న వెటరన్ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా టీమ్ మాజీ బ్యాటర్ జస్టిన్ లాంగర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. త్వరలో ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచ కప్ పూర్తయ్యాక ఇండియన్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగుస్తుండటంతో రాహుల్ ద్రావిడ్ తరువాత అతని ప్లేస్ ని ఫుల్ ఫిల్ చేసే అనుభవం ఉన్న ఆటగాడి కోసం బీసీసీఐ గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. కోచ్ పదవి కి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.
నాకీ పదవి సెట్ కాదు..
అయితే తాజాగా లాంగర్ ఈ రేసు నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి బాధ్యతలు తనకు సరిపడవని లాంగర్ భావించడమే ఇందుకు కారణమంటున్నాడు. దీనిపై లాంగర్ మాట్లాడుతూ.. లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ గా ఉన్న తనకు గతంలో కేఎల్ రాహుల్ తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు. ‘‘ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ పదవిలో ఉండటమంటే ఆషామాషీ కాదు. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐపీఎల్ కోచ్ గా ఉండటం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఒత్తిళ్లకు గురవ్వాలి’’ అని కేఎల్ రాహుల్ చెప్పినట్లు లాంగర్ తెలిపాడు.
వెయ్యి రెట్లు ఒత్తిడి అని రాహుల్ చెప్పాడు.
‘‘నాకు తెలుసు ఇది చాాలా బాధ్యతతో కూడుకున్న పదవి. ఆస్ట్రేలియన్ టీమ్ తో నాలుగు ఏళ్లు ఇదే పని చేశాను నాకు అంత ఒత్తిడి తీసుకోవడం ప్రస్తుతం సాధ్యం కాదు. ఐపీఎల్ టీమ్ ను లీడ్ చేసే క్రమంలో ఒత్తిడి, రాజకీయాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఇండియన్ కోచ్ గా టీమ్ ని లీడ్ చేసేందుకు ఇలాంటి ఒత్తిళ్లను వెయ్యి రెట్లు ఎక్కువగా అనుభవించాలి అని రాహుల్ నాతో చెప్పాడు. నాకు ఆ సలహా చాలా నచ్చింది’’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు.
నేను ఇష్టపడే వాటిని వదులుకోలేను..
‘‘ఐపీఎల్ జరిగేటప్పుడు నేను ఈ విషయంపై చాలా మందితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక జాతీయ జట్టుకు సీనియర్ కోచ్ గా ఉండటం నాకిష్టమే. కానీ నా జీవితంలో మిగతా విషయాలకు కూడా కొంచెం టైమ్ ఉండాలి కదా. నా ఫ్యామిలీతో గడపాలి ఇతర పనులు చేసుకోవాలి. ఇండియన్ టీమ్ తో కలిసి పనిచేయడం అంత సులభం కాదు. ఈ పనికి ఒప్పుకుంటే మళ్లీ ఐపీఎల్ లో పనిచేసే అవకాశం ఉండదు. ఇది కూడా నేను ఈ పదవికి దూరంగా ఉండాలనుకోవడానికి కారణం. ఒక జాతీయ జట్టుకు హెడ్ కోచ్ గా చేయడమంటే.. ఏడాదికి 10, 11 నెలలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నేను దీన్ని చేయాలనుకున్నా.. ప్రస్తుతం నా లైఫ్ స్టైల్‌కి ఇది సెట్ కాదు. నేను ఇస్టపడే వాటిని ఎన్నింటినో వదులుకోవాలి’’ అని లాంగర్ వివరించాడు.
అంతకుముందు.. లాంగర్ మాజీ టీమ్ మేట్ అయిన ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా.. ఈ పదవి నుంచి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నట్లు వార్తలొచ్చాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)