Tirumala: తిరుమలలో మొదలైన న్యూ ఇయర్ సందడి..భక్తుల రద్దీ అస్సలు తగ్గడం లేదుగా!
Tirumala New Year 2025: తిరుమలలో న్యూ ఇయర్ సందడి అప్పుడే మొదలైనట్టుంది. వీకెండ్ తర్వాత న్యూ ఇయర్ రావడంతో ఇప్పటి నుంచీ రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులున్నారు.
Tirumala Rush: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఇయర్ ఎండ్ ..కొత్త ఏడాదికి స్వాగతం పలికే ముందు వచ్చిన వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 29 ఆదివారం తిరుమలకు భక్తులు పోటెత్తారు.
ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో తిరుప్పావై జరుగుతుంది..శ్రీ వేంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఈనెలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అందుకే శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారు. క్యూ లైన్ లో గంటలతరబడి నిలబడి ఉన్న భక్తులకు తాగునీరు , మజ్జిగ, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
సాధారణంగా ఇయర్ ఎండ్ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది..పైగా వీకెండ్ కావడంతో డిసెంబర్ నెలాఖరున రష్ మరింత ఎక్కువైంది. మరో పది రోజుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే టికెట్లన్నీ ముందస్తుగా బుక్ అయిపోయాయ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామిని దర్శించుకునే అవకాశం లేనివారు ముందస్తుగా న్యూ ఇయర్ రోజు శ్రీవారిని చూసి తరించాలనుకుంటారు.
Also Read: వైకుంఠ ఏకాదశి, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం సహా 2025 జనవరిలో తిరుమలలో విశేష పర్వదినాలివే!
ఏడాది ఆరంభంలో శ్రీవారిని దర్శించుకుంటే..సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటామని, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఉండవని భక్తుల విశ్వాసం. అందుకే కొత్త ఏడాది మొదటి రోజు స్వామివారి సన్నిధిలో ఉండాలని తాపత్రయపడతారు.
ఇయర్ ఎండ్ సందర్భంగా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు కిటకిటలాడుతున్నాయ్.
ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల టైమ్ పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 3 గంటలకు పైగానే పడుతుంది.
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల వరకూ దర్శన సమయం పడుతుంది.
డిసెంబర్ 28 శనివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,414... ఈ ఒక్క రోజు హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు
Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!
ఇక తిరుమలకు వెళ్లే భక్తులు కొందరు సొంతవాహనాల్లో వెళితే మరికొందరు స్థానిక వాహనాలను వినియోగిస్తుంటారు. ఇదే అదనుగా ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారని టీటీడీ అధికారులకు ఫిర్యాదులు అందాయ్. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన టీటీడీ ఈవో శ్యామలరావు .. ప్రైవేట్ వాహనాలు ఎక్కువ మొత్తంలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం TTD ఇప్పటికే 12 ధర్మరథాలను నడుపుతోందని..త్వరలోనే మరిన్ని వాహనాలు అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు.
వెంకటేశ్వర వజ్రకవచం - మార్కండేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!