అన్వేషించండి

Tirumala Special Days 2025 : వైకుంఠ ఏకాదశి, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం సహా 2025 జనవరిలో తిరుమలలో విశేష పర్వదినాలివే!

Tirumala 2025: నూతన సంవత్సరంలో మొదట వచ్చే పర్వదిన వైకుంఠ ఏకాదశి. తిరుమలేశుడి ఉత్తరద్వార దర్శనంకోసం భక్తులు పోటెత్తుతారు. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ఇంకా 2025 జనవరిలో తిరుమలలో చాలా పర్వదినాలున్నాయి..

Tirumala New Year 2025: నూతన సంవత్సరం 2025 జనవరిలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను TTD వెల్లడించింది. ఏ తేదీల్లో ఏ ఉత్సవాలను నిర్వహిస్తారో జాబితా ఇక్కడ తెలుసుకోండి. జనవరి 9న చిన్న శాత్తుమొర ఉత్సవం నుంచి జనవరి 29  శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు వరకూ వైభవంగా జరగనున్నాయి..ఈ నెలలో అత్యంత ముఖ్యమైన రోజు వైకుంఠఏకాదశి...

Also Read: నూతన సంవత్సరం 2025 ఆరంభం ఈ రాశులవారికి బంగారంలా ఉంటుంది!

జనవరి 09 
చిన్న శాత్తుమొర

జనవరి 10
వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం

జనవరి 11
వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం.

జనవరి 15
ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.

జనవరి 17
తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

జనవరి 18
శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం

జనవరి 19
పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.

జనవరి 20
శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

జనవరి 23
అధ్యాయనోత్సవాలు సమాప్తం.

జనవరి 24
తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.

జనవరి 25
సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం

జనవరి 27
మాస శివరాత్రి.

జనవరి 29
శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు

Also Read: 2025 జనవరి మొదటి వారం మేష రాశి to కన్యా రాశి 6 రాశుల వారఫలాలు!

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకం

మరోవైపు జనవరి 10న ముక్కోటి ఏకాదశి/ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ...వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు..దీనికి సంబంధించి  తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీకి 91 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 10, 11, 12 తేదీలకోసం జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆ ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని  టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆధార్ కార్డ్ చూపించి ఈ టోకెన్లు పొందాలని...ఈ పది రోజుల పాటూ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని..టోకెన్లు లేని భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు

జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీడీపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయగా.. రోజుకు 40 వేల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

డిసెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచీ ధనుర్మాసంలో శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇక జనవరి 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.  జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. జనవరి 11  వైకుంఠ ద్వాదశి రోజు ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. 

Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget