అన్వేషించండి

Weekly Horoscope : నూతన సంవత్సరం 2025 ఆరంభం ఈ రాశులవారికి బంగారంలా ఉంటుంది!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. జనవరి మొదటివారంలో తులా నుంచి మీనం వరకూ ఆరు రాశుల వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

weekly horoscope 30 december to 5 january 2025 : డిసెంబర్ 30 నుంచి జనవరి 05  వరకూ వారఫలాలు

తులా రాశి వారఫలం (Libra Weekly Horoscope)

ఈ వారం మీరు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వైవాహిక  జీవితం సంతోషంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వారం ప్రారంభంలో కొన్ని చికాకులుంటాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మీరు అసంతృప్తి చెందవచ్చు. ఒత్తిడి మిమ్మల్ని అధిగమించనివ్వవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం ఇవ్వకుండా ఉండాలి. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. అధిక రక్తపోటు రోగులు జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వృశ్చిక రాశి వారఫలం  (Scorpio Weekly Horoscope)

ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన సంవత్సర వేడుకలను ఆనందిస్తారు. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతతో ఉంటారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది...అయితే వారి భావాలు అగౌరవపరచొద్దు.   తప్పుడు ఆలోచనలకు దూరం పాటించండి.ఆస్తికి సంబంధించిన విషయాలు లాభిస్తాయి. ప్రేమ సంబంధాల గురించి యువత చాలా ఉత్సాహంగా ఉంటారు. పాత మిత్రులను కలుస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంలో సంకోచం ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!

ధనస్సు రాశి వారఫలం (Sagittarius Weekly Horoscope) 

ఈ వారం మీరు కమీషన్ సంబంధిత పనులలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. మేధోపరమైన చర్చలపై చాలా ఆసక్తిని కనబరుస్తారు. కార్యాలయంలో ప్రమోషన్ గురించి చర్చ ఉండవచ్చు. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి  ప్రాణాయామం చేయండి. మీ పని మీద , దేవుని మీద నమ్మకం ఉంచండి. నోటి సంబంధ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. రహస్య ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.  అప్రధానమైన విషయాలను విస్మరించండి.

మకర రాశి (Capricorn Weekly Horoscope)

ఈ వారం మంచి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో  ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి. టెక్నాలజీ సంబంధిత వ్యాపారంలో మీరు మంచి లాభాలను పొందుతారు. విద్యకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి.  సాంకేతిక సంబంధిత పనులపై ఆసక్తి చూపుతారు. ప్రభుత్వోద్యోగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు చాలా ప్రయోజనాలను పొందుతారు.  రాజకీయ పరిచయాలకు దూరం పాటించండి.  హార్ట్ పేషెంట్ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ మాటలకు కట్టుబడి ఉండండి. జీవిత భాగస్వామితో వివాదాలు రావచ్చు.

Also Read: కొత్త ఏడాదిలో సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దసరా, దీపావళి ఎప్పుడొచ్చాయ్ - 2025 లో సెలవులు, పండుగల తేదీలివే!

కుంభ రాశి  (Aquarius Weekly Horoscope) 

ఈ వారం వృత్తిపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఏకకాలంలో అనేక బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. హక్కులు, సుఖాలు పెరుగుతాయి. ప్రతికూల పరిస్థితులను శక్తివంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఆశించిన లాభాలు పొందుతారు. మీ పని నాణ్యతను పెంచుకోవడానికి   సన్నిహితుల సలహాలు స్వీకరించండి. ప్రతికూల ఆలోచనల కారణంగా మనస్సులో సందేహాలు తలెత్తుతాయి.  మీరు నిర్వహించలేని ఏ పనీ ప్రారంభించవద్దు. ఇతరుల భావాలను గౌరవించండి. బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై ఒత్తిడి ఉంటుంది.


మీన రాశి (Pisces Weekly Horoscope) 

ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. భూమి లేదా బంగారం కొనుగోలు చేస్తారు. మీ గౌరవం పెరుగుతుంది.  సహోద్యోగులతో మీ సమన్వయం బాగుంటుంది.  మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మిత్రులతో సంబంధాలు మధురంగా ​​ఉంటాయి. అవసరమైన పనులన్నింటిలో మంచి పురోగతి ఉంటుంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళికల నుంచి మీరు ప్రయోజనాలు  పొందుతారు. దైవిక శక్తిపై మీ విశ్వాసం బలపడుతుంది. అయితే మితి మీరిన కోపం తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి.

Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Telangana TDP: తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Embed widget