Weekly Horoscope : 2025 జనవరి మొదటి వారం మేష రాశి to కన్యా రాశి 6 రాశుల వారఫలాలు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. జనవరి మొదటివారంలో మేషం నుంచి కన్యా వరకూ ఆరు రాశుల వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
weekly horoscope 30 december to 5 january 2025 : డిసెంబర్ 30 నుంచి జనవరి 05 వరకూ వారఫలాలు
మేష రాశి వారఫలం (Aries Weekly Horoscope)
ఈ వారం మీరు కార్యాలయంలో ఏదైనా కొత్తవిషయం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. పరిశోధన పనిలో నిమగ్నమైన వ్యక్తులు మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన పెట్టుబడులతో లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వివాదాస్పద విషయాలను పరిష్కరించుకుంటారు. వారం ప్రారంభంలో కొంత విచారంగా ఉంటారు..మీ వైఫల్యానికి ఎదుటివారిని నిందించవద్దు. మీ సన్నిహితులే మీకు ప్రత్యర్థుల్లా ప్రవర్తిస్తారు. వివాహం చేసుకోవాలి అనుకునేవారు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
వృషభ రాశి వారఫలం (Taurus Weekly Horoscope)
వారం ప్రారంభంలో అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పని పట్ల మీ అంకితభావం ప్రశంసలు అందుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. స్నేహితులను కలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. మీ ప్రవర్తన కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గొప్పతనాన్ని చాటుకునేందుకు అతిగా ఖర్చు చేయవద్దు. కుజుడి ప్రభావంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!
మిథున రాశి వారఫలం (Gemini Weekly Horoscope)
ఈ వారం మీరు మీ సామర్థ్యాలను బాగా ఉపయోగించుకోగలరు. ఆలోచనాత్మకంగా పని చేయండి.. మీ హక్కుల గురించి తెలుసుకోండి. మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఓపికతో, అవగాహనతో పని చేయడం మంచిది. మీ బాధ్యతల పట్ల విధేయత చూపండి. అత్యంత గౌరవనీయమైన వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపారంలో మందగమనం ఉన్నప్పటికీ లాభాలు ఆర్జించగలరు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఇబ్బందిపెడతాయి. కంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పాత విషయాలకు సంబంధించిన చర్చలు పెరుగుతాయి. సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేయవచ్చు. పిల్లలు చదువుపై పెద్దగా ఆసక్తి చూపరు. అదనపు పనికి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది.
కర్కాటక రాశి వారఫలం (Cancer Weekly Horoscope)
ఈ వారం మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో అవసరాలు సమయానికి తీరుస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అయితే వారం మధ్యలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంకొంతకాలం కష్టపడాల్సిందే. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇతరుల సంతోషం కోసం మీకు మీరు హాని చేసుకోవద్దు.
సింహ రాశి వారఫలం (Leo Weekly Horoscope)
ఈ వారం మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీ ప్రియమైనవారి పట్ల మీ ప్రవర్తన సానుకూలంగా ఉంచండి. పర్యాటకానికి సంబంధించిన రంగాలంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ శ్రమ, పని సామర్థ్యం పెరుగుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు లాభాలు పొందుతారు. అయితే వారం పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించేవారు ఇంకొంత కాలం ఆగాల్సిందే. నమ్మిన స్నేహితులు మోసం చేస్తారు. మీకు సంబంధించిన రహస్య విషయాలను బయటవ్యక్తులతో పంచుకోవద్దు.
కన్యా రాశి వారఫలం (Virgo Weekly Horoscope)
ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారాల్లో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. సాహసోపేత కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కమీషన్ , బీమాలో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. బిల్డర్లు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త ప్రాజెక్ట్‌లను పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఉండేవారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. డబ్బు వృధా చేయకండి. మీ కెరీర్ మార్గంలో అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు. మీ జీవితంలో క్రమశిక్షణ పాటించండి. ఇంటి వివాదాల ప్రభావం కార్యాలయంలో పనిపై పడకుండా జాగ్రత్తపడండి.
Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.