Kaal Bhairav Jayanti 2024: కాలాన్ని మార్చలేకపోయినా..పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు నిత్యం ఇది పఠించండి!
Kaal Bhairav Astami 2024: డిసెంబరు 08 కాలభైరవాష్టమి. కేవలం ఆరోజు మాత్రమే కాదు నిత్యం కాలభైరవాష్టకం పఠించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి.

Kaal Bhairav Astakam 2024: కాలబైవుడిని అష్టభైరవ రూపాల్లో, 64 రూపాల్లో కొలుస్తారు. చాలా శైవక్షేత్రాలలో క్షేత్రపాలకుడు అంటే కాలభైరవుడే. వారణాసి, ఉజ్జయిని లాంటి క్షేత్రాల్లో కాలభైరవుడికి చాలా విశిష్టత ఉంది.
శునకాన్ని వాహనంగా చేసుకుని...నాగులు చెవిపోగులుగా ధరించి, పులి చర్మాన్ని కట్టుకునే భైరవుడు ఉగ్రమూర్తిలా కనిపిస్తాడు కానీ భక్తులను అనుగ్రహించే శుభంకరుడు కాలభైరవుడు.
నిత్యం కాలభైరవుని పూజించి అష్టకం చదువుకుంటే అప్పుల బాధలు, మానసిక సమస్యలు, జాతకంలో సమస్యలు , అనారోగ్యం తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఏడాదంతా కాల భైరవుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు..అయితే కాలభైరవాష్టమి రోజు మాత్రం రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేయాలి..శివరాత్రిలా. ఎందుకంటే కాలభైరవుడికి అర్థరాత్రి ఆరాధన అంటే ప్రీతి. అందుకే కొన్ని ముఖ్యమైన క్షేత్రాల్లో కాలభైరవుడిని రాత్రి సమయంలో పూజిస్తారు. ఈ సమయంలో కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా అవసరం. ఓ వారం రోజులు నిత్యం పఠిస్తే ఈజీగా చదువుకోవడం అలవాటైపోతుంది..
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు ఆరోగ్య చిట్కాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!
కాలభైరవ అష్టకం(Kalabhairava Ashtakam)
దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం
నారదాదియోగివృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలంస్థితం సమస్తలోక విగ్రహం
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
రత్నపాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం
నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్ర మోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
అట్టహాసభిన్నపద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం
అష్టసిద్ధిదాయకంకపాలమాలికంధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాస లోకపుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్య వర్ధనం
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవం
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ||
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
కాలభైరవుడిని పూజిస్తే గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రంలో ఉంది. మార్గశిర మాసంలో వచ్చే అష్టమిని కాల భైరవాష్టమిగా జరుపుకుంటారు. కాలభైరవాష్టమిని కాశీ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. కాశీ సహా ఉజ్జయిని, ఢిల్లీలోనూ కాలభైరవ క్షేత్రాలున్నాయి. అయితే శివుని ఆజ్ఞ ప్రకారము కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉండిపోయిన భైరవుడిని చాలా పవర్ ఫుల్ గా భావిస్తారు భక్తులు.
కాల భైరవ జయంతి (Kaal Bhairav Jayanti 2024) రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటారు. తంత్ర విద్యలు నేర్చుకునే వారు కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
Note: కొందరు పండితుల నుంచి తెలుసుకున్న వివరాలు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం....
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!
ఓం నమఃశివాయ....
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

