![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sabarimala Devotees : శబరిమల వెళ్లే భక్తులకు ఆరోగ్య చిట్కాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!
Sabarimala: మండల దీక్ష తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం వెళ్లేభక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అవగాహన కలిగి ఉండాలి..
![Sabarimala Devotees : శబరిమల వెళ్లే భక్తులకు ఆరోగ్య చిట్కాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి! Heading to Sabarimala Health tips phone number alternate routes and more for devotees know in telugu Sabarimala Devotees : శబరిమల వెళ్లే భక్తులకు ఆరోగ్య చిట్కాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/20/b1b6d42274b236d41f4a6328a6b207161732092353744217_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health Tips for Sabarimala Devotees: కార్తీకమాసం మొదలు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకూ అయ్యప్ప సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 41 రోజుల పాటూ కఠిన నియమాలు పాటిస్తూ అయ్యప్ప దర్శనానికి బయలుదేరుతారు స్వాములు. వీరిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉంటారు. మరికొందరు దీర్ఘకాల అనారోగ్యంతో ఉన్నప్పటికీ అయ్యప్పను చూడాలనే ఆశతో ఇరుముడి కట్టుకుని కొండెక్కుతారు. అయితే భక్తి సంగతి సరే మీ ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
స్వామి దర్శనానికి వెళ్లేముందు కొన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో పాటూ అక్కడున్న సౌకర్యాల గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగిఉండాలి. ఎక్కడెక్కడ ఆరోగ్య కేంద్రాలున్నాయి, ఎవర్ని సంప్రదించాలి, ఏదైనా ప్రమాదం జరిగితే హెల్పై లైన్ నంబర్లు ఏంటి? ఇవన్నీ ముందస్తుగా తెలుసుకుంటే మంచిది. మీరు తెలుసుకోవడంతో పాటూ అయ్యప్ప మాలధారులకు కూడా ఈ విషయాలు తెలిసేలా చేయండి.
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
వివిధ భాషలు మాట్లాడే వైద్యులతో పాటూ వాలంటీర్లతో 24/7 ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసింది కేరళ ఆరోగ్య శాఖ. కొండెక్కే సమయంలో ఏ చిన్న అసౌకర్యం అనిపించినా భక్తులు వెంటనే ఈ ఆరోగ్య కేంద్రం నుంచి సహాయం తీసుకునేందుకు వేనుకాడవద్దు..
మీరు దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నవారు అయితే..ముందుగానే యాత్ర చేసే రోజులకు సరిపడా మందులు మీ దగ్గర ఉంచుకోండి. మీ అనారోగ్యానికి సంబంధించిన రిపోర్టులు కూడా తీసుకెళ్లండి. మధ్యలో అనుకోకుండా అనారోగ్యం పాలైతే.. మీ గత రిపోర్టులతో అవసరం పడొచ్చు. అప్పుడే మీకు సరైన చికిత్స అందించగలరు..
దీక్ష చేపట్టిన సమయం, యాత్రా సమయంలోనూ మీ రెగ్యులర్ మందులను ఆపేయవద్దు..
ఎప్పుడూ నడక, వ్యాయామం లాంటివి అలవాటు లేనివారు ఒక్కసారిగా కొండెక్కడం చాలా కష్టం.. అందుకే కనీసం మాల వేసుకున్న 41 రోజులు అయినా నిత్యం పూజ, ఫలహారం అనంతరం కాసేపు నడక,వ్యాయామం ప్రాక్టీస్ చేయండి
రాళ్లు , రప్పల మధ్య కొండెక్కుతున్నప్పుడు తొందరగా అలసిపోతే బలవంతంగా నడవొద్దు..కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని మళ్లీ నడక సాగించండి.
భోజనం, ఫలహారం చేసిన వెంటనే కొండెక్కవద్దు..తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాకే మళ్లీ నడక ప్రారంభించండి
Also Read: కడప దర్గాకి రామ్ చరణ్ - అయ్యప్ప మాలధారులు మసీదు, దర్గాలకు వెళ్లొచ్చా!
వైద్య సహాయం కోసం 04735 203232 నంబర్‌కు కాల్ చేయండి
ఏ అనారోగ్యం అయినా తొందరగా అటాక్ అయ్యేది నీళ్ల ద్వారానే..అందుకే గోరు వెచ్చటి నీటిని తీసుకోండి
పరిశుభ్రత పాటించడం అత్యవసరం.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయవద్దు. టాయిలెట్లు ఉపయోగించండి..అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోండి
నడకమార్గంలో చెట్ల మధ్య వెళుతున్నప్పుడు పాముకాటుకి గురైతే...వెంటనే హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి శబరిమలలో ఏర్పాటు చేసిన మీకు అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లండి..అక్కడ యాంటీవనమ్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి
నీలిమల, పంబా, సన్నిధానం సమీపంలో ఉన్న హాస్పిటల్స్ లో గుండె సంబంధిత చికిత్స, చెకప్‌లు...సంబంధిత సేవలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)