అన్వేషించండి

Dussehra Navratri 2023: పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు!

శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి వినియోగించిన పదార్థాలు, మాంసాహారం తినొద్దని చెబుతారు. వాస్తవానికి నవరాత్రులనే కాదు ఏ పండుగొచ్చినా కూడా ఇదే ఫాలో అవ్వాలి అంటారు. ఎందుకు...తింటే ఏమవుతుంది.

Dussehra Navratri 2023:  హిందూ ధర్మంలో పండగలకు విశిష్టస్థానం ఉంది. పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో తినే ఆహారానికి కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా అత్యంత పవర్ ఫుల్ అని చెప్పే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించేవారంతా కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటిస్తారు. ఇందులో భాగంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి , ఇతర మసాలా పదార్థాలేవీ కూడా తినరు. సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. ఇందుకు కారణం ఏంటంటే... ముందు మనిషిలో ఉండే మూడు గుణాల గురించి తెలుసుకోవాలి... వీటినే త్రిగుణాలు అంటారు. ఈ మూడు గుణాల కారణంగానే జీవుడు శరీరంలో బంధించి ఉన్నాడని భగవద్గీత చెబుతోంది.

1.సత్వగుణం
సత్వగుణం జ్ఞానంపై ఆసక్తి కలిగిస్తుంది. దైవంపై, దైవకార్యాలపై మనసుని మళ్లిస్తుంది, నిత్యం ప్రశాంతంగా ఉంచుతుంది. మృదువుగా మాట్లాడేలా చేస్తుంది. ఉదాహరణ రాముడు, కృష్ణుడు

2.రజోగుణం
నేను అనే అహానికి ప్రతీక రజోగుణం. రజోగుణం అధికంగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు.  ఎప్పుడూ ఏదో ఆలోచన, ఆందోళన, అసంతృప్తి, అశాంతి, ఏదో చేయాలనే తపనతో ఉంటాడు. ఉదాహరణ దుర్యోధనుడు, రావణుడు

3.తమోగుణం 
తమోగుణం అధికంగా ఉంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా-దాక్షిణ్యాలపై ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస ఉంటాయి.

ఈ మూడు గుణాల గురించి ఇప్పుడెందుకంటే...మనం తినే ఆహారమే మనలో గుణాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆహారాన్ని కూడా సాత్విక ఆహారం, రాజాసిక్, తమాసిక్ ఆహారాలుగా పేర్కొన్నారు. 

Also Read: శని ప్రభావం తగ్గించే కాళరాత్రి దుర్గ అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక!

సాత్విక ఆహారం
సాత్విక ఆహారం స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఇందులో కాలానుగుణ తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, విత్తనాలు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనస్సును, శరీరాన్ని స్వచ్ఛంగా సమతుల్యంగా ఉంచుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది. ఎప్పుడూ ఉత్సాహంగా అందరితో స్నేహంగా ఉంటాడు. 

రజాసిక్ ఆహారం
రజాసిక్ ఆహారంలో మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు , డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్లు ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది కానీ శరీర సమతుల్యత గాడి తప్పుతుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. వీటిని తినడానికి ఎంత ఆతృత ఉంటుందో... అంతే వేగంగా కోపం, అసహనం, ఆందోళన కలుగుతాయి..

తమాసిక్ ఆహారం
ఇందులో ప్రధానంగా మళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు  ఉంటాయి. ఈ ఆహారాన్ని భుజించేవారు బద్దకంగా, నిస్తేజంగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. మనసుకి, శరీరానికి హాని కలిగించే ఈ ఆహారం తీసుకోవడం వల్ల దయగల ఆలోచన వీరి దరిచేరదని చెబుతారు. 

Also Read: శరన్నవరాత్రుల్లో ఏడో రోజు శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితాదేవి అలంకారంలో దుర్గమ్మ

అందుకే ప్రశాంతంగా,సంతోషంగా జరుపుకునే శుభకార్యాల్లో రజోగుణం, తమోగుణం కలిగించే ఆహార పదార్థాలు తీసుకోరు. తొమ్మిదిరోజులు అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో భక్తులతో పూజలందుకుంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా విజయదశమిని జరుపుకుంటారు. ఇందులో చివరి మూడు రోజులైన దుర్గాష్టమి, మహర్నవమి, దశమి ప్రత్యేకం...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Holi party bill: హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
New Toll Policy: మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
GST on UPI Payments:రూ. 2000కు మించి చేసిన యూపీఐ చెల్లింపులపై GST వేస్తారా?
రూ. 2000కు మించి చేసిన యూపీఐ చెల్లింపులపై GST వేస్తారా?
Embed widget