చాణక్య నీతి: యువత ఈ విషయాలకు దూరంగా ఉండకపోతే భవిష్యత్ అంధకారమే!



ఆచార్య చాణక్యుడి విధానాల్లో మానవ జీవితంలో చాలా ముఖ్యమైన దశ యవ్వనం. ఈ దశలో ప్రవర్తనపైనే భవిష్యత్ మొత్తం ఆధారపడి ఉంటుందంటాడు చాణక్యుడు



తమ పురోగతికి మెట్లు వేసుకుంటారో..పాతాళానికి పడిపోతారో నిర్ణయించుకోవాల్సిన దశ ఇదే. అందుకే కొన్నింటికి దూరంగా ఉండాలని చాణక్యుడు బోధించాడు



యుక్తవయస్సులో సరైన మార్గనిర్ధేశకత్వం ఉండాలి, మంచి మాటలు పరిగణలోకి తీసుకోవాలి..కాదు కూడదు అంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడినా ఎలాంటి ప్రయోనం ఉండదని చెప్పాడు చాణక్యుడు



ఓ అడుగు ముందుకు వేయాలన్నా, ఇంటా-బయటా గౌరవ మర్యాదలు పొందాలన్నా యువత దూరంగా ఉండాల్సిన కొన్ని విషయాల గురించి చెప్పాడు చాణక్యుడు



చెడు సహవాసాలు
బుట్టలోని కుళ్ళిన యాపిల్ మిగిలిన పండ్లను పాడుచేసినట్లే... చెడ్డవారి సాంగత్యం మీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చెడు పనులు చేయడం ఎంత తప్పో చెడుపనులు చేసేవారితో కలసి తిరగడం కూడా అంతే తప్పు



మాదకద్రవ్యాలకు, దురాశకు, కొట్లాటలు, పోరాటాలకు దూరంగా ఉండాలి. అలాంటి వారితో స్నేహం చేయడం ద్వారా, వారు సమాజంలో మీ ప్రతిష్టను పాడు చేయడమే కాకుండా మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని దూరం చేస్తారు.



కోపం - దురాశ
మంచి అలవాట్లు మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తాయి. యువతలో కోపం దురాశ వంటి భావాలు పెరగడం ప్రారంభమైతే అది మీ ఆలోచనా శక్తిని ప్రభావితం చేస్తుంది. మీ కెరీర్ కి ముఖ్యమైన అడ్డంకి అదే...



సోమరితనం
సోమరితనం మనిషికి అతి పెద్ద శత్రువు. యవ్వనంలో కష్టపడి పనిచేసే వ్యక్తి కెరీర్‌లో శిఖరాగ్రానికి చేరుకుంటాడని చాణక్య నీతి చెబుతోంది. యవ్వనంలో సోమరితనం ఉన్న వ్యక్తికి కాలం మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు అంధకారమే.


Thanks for Reading. UP NEXT

బతుకమ్మని ఎందుకు నిమజ్జనం చేస్తారు

View next story