ABP Desam


బతుకమ్మని ఎందుకు నిమజ్జనం చేస్తారు


ABP Desam


బతుకమ్మ పేర్చేందుకు ఉపయోగించే పూలలో ఔషధ గుణాలు ఇమిడి ఉంటాయి. 9 రోజుల పాటు 9 రకాల పూలను సేకరించి.. అందంగా పేర్చుతారు


ABP Desam


తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ , నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ...


ABP Desam


ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు.


ABP Desam


సద్దుల బతుకమ్మ రోజు పూజ, ఆటపాటల అనంతరం నిమజ్జనం చేస్తారు. ఈ పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల నీరు శుద్ధి అవుతుంది.


ABP Desam


తంగేడు పూలలో సూక్ష్మక్రిములను చంపే గుణం ఎక్కువగా ఉంటుంది. చెరువులలో నీరు శుద్ధి కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


ABP Desam


గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది.. సీత జడ పువ్వులైతే జలుబు, ఆస్తమాను దూరం చేస్తాయి


ABP Desam


మందారపువ్వు చుండ్రు రాకుండా నిరోధిస్తుంది.. కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి.. గుమ్మడి పువ్వులో విటమిన్ఏ పుష్కలంగా ఉంటుంది


ABP Desam


ఇలా బతుకమ్మలో వినియోగించే పూలన్నింటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటన్నింటినీ నిమజ్జనం చేయడం వల్ల చెరువుల్లో నీరు శుద్ధి అయి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది, నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.



వర్షాకాలం పూర్తై శీతాకాలం ఆరంభంలో వచ్చే పండుగ ఇది. ఈ సమయంలో చెరువులన్నీ నిండుకుండల్లా ఉంటాయి. ఎటుచూసినా పచ్చదనం పలకరిస్తుంది. గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.



అందుకే అవి ఇవి అనే వ్యత్యాసం లేకుండా గడ్డి పూల నుంచి గులాబీలవరకూ అన్నీ సేకరించి ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుతూ పూజిస్తారు. అనంతరం వాటిని నిమజ్జనం చేస్తారు. (Images Credit: Pinterest)