అన్వేషించండి

Karthika Masam 2024: మీరు దర్శించుకుంటున్నది ఎలాంటి శివలింగం - ఎన్ని రకాలున్నాయో తెలుసా!

Types of Shivling: కార్తీకమాసం, శివరాత్రి సమయంలో శైవ క్షేత్రాలు కళకళలాడిపోతుంటాయి. లింగరూపంలో వెలసిన శివయ్య భక్తుల పూజలందుకుంటాడు. ఇంతకీ మీరు ఏ శివలింగానికి పూజచేస్తున్నారో తెలుసా?

Various Forms of Siva lingam:  పరమేశ్వరుడిని భక్తులంతా నిరాకారుడైన లింగరూపంలోనే పూజిస్తారు. స్థానికంగా ఉండే శివాలయాల మొదలు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో, విదేశాల్లోనూ పరమేశ్వరుడిని లింగరూపంలో కొలువుతీర్చే పూజిస్తారు. అయితే శివలింగాలన్నీ ఒకటే కాదు..వాటిలో భిన్నమైన రకాలున్నాయి. 
 
శివలింగాలు ఎన్ని రకాలు?

శివలింగాలను ఎలా విభజించారు?

శివపురాణం ప్రకారం శివలింగాలను మూడు రకాలుగా విభజించారు..వీటిని ఎత్తు ఆధారంగా విభజన చేశారు. శివలింగాల పరిమాణాన్ని బట్టి  ఉత్తమం, మధ్యం, అధమం అని విభజించారు. వీటిలో ఉత్తమ  శివలింగానికి కింద బలిపీఠం నిర్మించబడి ఉంటుంది. బలిపీఠం నుంచి నాలుగు వేళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న శివలింగం మధ్యస్థమైనదిగా, అంతకన్నా చిన్నది అధమంగా పరిగణిస్తారు.   

Also Read: కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ - శివతాండవ స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్!

అండాకారంలో ఉండే శివలింగం, పాదరసంతో చేసిన శివలింగం అని మరో రెండు రకాలుగా విభజించారు

వివిధ సందర్భాల్లో దేవతలు ప్రతిష్టించి పూజించిన శివలింగాలను దేవలింగాలు అంటారు...అంటే రాముడు, కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు సహా దేవతలు ప్రతిష్టించిన లింగాలు ఈ కోవకే చెందుతాయి.. 
 
రావణుడు సహా రాక్షసులు ప్రతిష్టించిన శివలింగాలను అసుర లింగాలు అంటారు.  

మునులు, రుషులు ధ్యానించి ప్రతిష్టించిన లింగాలను అర్షలింగాలు అని పిలుస్తారు
 
ఇవేమీ కాకుండా పురాణకాలం నుంచి ఉన్న లింగాలను పురాణ లింగాలు అని పిలుస్తారు

ప్రస్తులం ఆలయాలు నిర్మించి ప్రతిష్టిస్తున్న శివలింగాలను మానవలింగాలు అంటారు

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
 
వీటన్నింటికీ అతీతంగా...ఏ మానవడు, మునులు, దేవతలు, రాక్షసులు..ఎవ్వరూ స్థాపించకుండా తనకు తానుగా శివుడు వెలిస్తే వాటిని స్వయంభూ లింగాలు అంటారు...అవే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. 

ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు మొత్తం 12 

  • రామనాథస్వామి లింగం - రామేశ్వరం 
  • శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం  
  • భీమశంకర లింగం - భీమా శంకరం
  • ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు
  • త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం  
  • సోమనాథ లింగం - సోమనాథ్
  • నాగేశ్వర లింగం - ద్వారక
  • ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
  • మహాకాళ లింగం - ఉజ్జయిని
  • వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్)
  • విశ్వేశ్వర లింగం - వారణాశి
  • కేదార్‌నాథ్‌ ఆలయం

ద్వాదశ   జ్యోతిర్లింగ స్త్రోత్రం
 
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి

ఇవి కాకుండా ఇంకా పంచారామాలు - పంచభూతలింగాలున్నాయి...

పంచారామాలు...

  • అమరారామము - అమరావతి
  • ద్రాక్షారామము- తూర్పుగోదావరి జిల్లా
  • సోమారామము- పశ్చిమగోదావరి జిల్లా
  • కుమారభీమారామం- తూర్పుగోదావరి జిల్లా
  • క్షీరారామము-  పశ్చిమగోదావరి జిల్లా 

పంచభూత లింగాలు..

  • అగ్ని లింగం :  అన్నామలైశ్వరుడు - అరుణాచలం
  • జల లింగం : జంబుకేశ్వరుడు-  జంబుకేశ్వరం
  • ఆకాశ లింగం : చిదంబరేశ్వరుడు - చిదంబరం
  • పృథ్వీ లింగం : ఏకాంబరేశ్వరుడు - కంచి
  • వాయు లింగం : శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి

ఓం నమఃశివాయ

Also Read: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget