Arunachalam Temple Giri Pradakshina: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ!
Arunachalam Giri Pradakshina which day What Result: అరుణాచల గిరిప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది... సోమవారం, మంగళవారం, శనివారం, పౌర్ణమి రోజుల్లో..ఇలా ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా..?
![Arunachalam Temple Giri Pradakshina: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ! guru purnima 2024 Arunachalam Temple Giri Pradakshina Giri valam which day What result The 44 Energy Points of Arunachalam Arunachalam Temple Giri Pradakshina: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/20/d60203d83747ae94ac9cbe258f22a6b01721447218674217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
A Spiritual Journey Around Arunachala Hill: కొండపై దేవుడు కాదు...ఏకంగా కొండే దేవుడిగా వెలసిన క్షేత్రం అరుణాచలం. ఈ క్షేత్రంలో గిరిప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. పంచభూత లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో శివుడు అగ్నిలింగా కొలువయ్యాడు. దేవతలు, సిద్ధులు సూక్ష్మశరీరంలో ఇప్పటికీ ప్రదక్షిణం చేసే ప్రదేశం అరుణాచలం. అలాంటి ప్రదేశంలో ప్రదక్షిణ చేసే అవకాశం రావడమే అదృష్టం. అలాంటప్పుడు ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అనే సందేహమే అవసరం లేదు.. ఏరోజు గిరిప్రదక్షిణ చేసినా అరుణాచలేశ్వరుడి కరుణాకటాక్షాలు లభిస్తాయి. అయితే మీకు రోజుల సెంటిమెంట్ ఉంటే మాత్రం.. ఏ రోజు వెళితే ఎలాంటి ఫలితం లభిస్తుంది? ఏ రోజు ప్రదక్షిణ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి...
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదివారం
ఏదైనా ఓ తీర్థంలో స్నానమాచరించి శివుడిని దర్శించుకుని...ఎవరికైనా దానం చేసి...అప్పుడు గిరిప్రదక్షిణ చేస్తే మోక్షానికి మార్గం చూపిస్తుంది. ఆదివారం గిరిప్రదక్షిణ చేసే అవకాశం లభించడం అంటే శివసాయుజ్యం పొందుతారు
సోమవారం
ఉద్యోగం, వ్యాపారాల్లో ఉండే ఇబ్బందులు ఎదుర్కొనేవారు... సోమవారం స్నానమాచరించి తడివస్త్రాలతో అరుణాచల గిరిప్రదక్షిణ చేయాలి. ఉన్నతమైన పదవి, చక్రవర్తి యోగం వస్తుంది..
మంగళవారం
అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలి అనుకునేవారు మంగళవారం గిరిప్రదక్షిణ చేయాలి. యమలింగం దగ్గర అంగారక రుణవిమోచన స్తోత్రం చదువుకుంటే చాలు...మిమ్మల్ని ఆవహించిన దారిద్ర్యం తొలగిపోతుంది
బుధవారం
మీరున్న రంగంలో ఉన్నత స్థానంలో చేరాలి అనుకుంటే బుధవారం రోజు అరుణాచలం గిరిప్రదక్షిణ చేయాలి
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
గురువారం
గురువారం అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే..గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. ఈ రోజే యోగులు, సిద్ధులు ప్రదక్షిణ చేస్తుంటారు..ఆ రోజు మీరు కూడా ప్రదక్షిణ చేస్తే వారి అనుగ్రహం మీపై ఉంటుంది
శుక్రవారం
శుక్రవారం గిరిప్రదక్షిణ చేస్తే అపారమైన సంపద వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి..మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది
శనివారం
నవగ్రహ శాంతుల కోసం వేలు , లక్షలు ఖర్చుచేస్తుంటారు...అస్సలు అవసరం లేదు.. శనివారం రోజు అరుణాచలం వెళ్లి ప్రదక్షిణ చేస్తే మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి
Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!
గిరిప్రదక్షిణ ప్రయోజనాలు
గుడిలో ప్రదక్షిణ చేస్తేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది... అలాంటిది ఏకంగా శివుడే కొండగా వెలసిన ప్రదేశం చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే అంతకన్నా ప్రయోజనం ఏం కావాలి. 14 కిలోమీటర్లు నడక వల్ల ..ఆనందం, భక్తితో మీకున్న కర్మను తొలగించుకోవచ్చు...మీపై ఉండే చెడు దృష్టిని తొలగించుకోవచ్చు. అరుణాచలం గిరిపై ఎన్నో ఔషధాలున్నాయి. హనుమంతుడు సంజీవిని తెస్తుండగా ఇక్కడో భాగం పడిందని స్కాందపురాణంలో ఉంది. అందుకే ఇక్కడ వాతావరణం, గాలి అత్యంత పవిత్రమైనవి , ఆరోగ్యకరమైనవి...ఇలాంటి ప్రదేశంలో నడక సాగించడం వల్ల మీ మెదడులో ఉన్న వ్యతిరేక ఆలోచనలు మాయమైపోతాయి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)