Yashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm
నిన్న లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ కి దిగితే వాళ్ల ఓపెనర్ బ్యాటర్ల ఆట భలే క్యూట్ గా అనిపించింది. యశస్వి జైశ్వాల్ తో పాటు నిన్న ఓపెనింగ్ చేసేందుకు వచ్చాడు వైభవ్ సూర్య వంశీ. కోటి పదిలక్షల రూపాయల పెట్టి ఆక్షన్ లో రాజస్థాన్ తీసుకున్న ఈ టీనేజర్ ను నిన్న ఫస్ట్ మ్యాచ్ ఆడించారు. ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్సే. జనరల్ గా ఏ టీమ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ ను ఆడించటానికి ట్రై చేస్తాయి. కానీ నిన్న రాజస్థాన్ మాత్రం టాప్ 3 బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ నే ఆడించింది. వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రానా కూడా లెఫ్టీనే. సరే ఓపెనర్లు జైశ్వాల్, సూర్యవంశీ ఇద్దరూ కలిసి లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రత్యేకించి సూర్యవంశీ ఆడిన ఫస్ట్ బాల్ నే సిక్సర్ గా మలిచి తన డెబ్యూ ను డేషింగ్ గా ప్రారంభిస్తే..ఫామ్ లోకి వచ్చేసిన యశస్వి జైశ్వాల్ నిన్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో సూర్యవంశీ 34పరుగులు చేస్తే...జైశ్వాల్ 52 బాల్స్ లో 5ఫోర్లు 4 సిక్సర్లతో 74పరుగులు చేశాడు. 181 పరుగుల ఛేజింగ్ లో మొదటి వికెట్ కు వీరిద్దరూ కలిసి 85పరుగుల పార్టనర్ షిప్ ను నెలకొల్పారు. జైశ్వాల్ వయస్సే 24 సంవత్సరాలు నిన్నటి వరకూ రాజస్థాన్ రాయల్స్ లో యంగెస్ట్ ప్లేయర్. అతనే చిన్న పిల్లాడు అనుకుంటే ఇప్పుడు అతని కంటే పదేళ్లు చిన్న పిల్లాడైన సూర్యవంశీ వచ్చాడు. సో జైశ్వాల్ జైశ్వాల్ భయ్యాగా మారిపోయి..చిన్న తమ్ముడు లాంటి సూర్యవంశీ కి సలహాలు సూచనలు ఇస్తూ తన ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకుంటూ ఇద్దరు కలిసి LSG పై విరుచుకుపడిన తీరు మాత్రం మంచి మజా ఇచ్చింది. ఆవేశ్ ఖాన్ ప్రతిభ వల్ల మ్యాచ్ రాజస్థాన్ ఓడిపోయింది కానీ గెలిచి ఉంటే ఈ జైశ్వాల్, సూర్యవంశీ ఓపెనింగ్ కు భలే మంచి పేరొచ్చేది.





















