Vaibhav Suryavanshi Batting vs LSG | IPL 2025 తో అరంగేట్రం చేసిన 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ | ABP Desam
14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఈ ఐపీఎల్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ పై తన కెరీర్ ను ఆరంభించాడు. ఆడిన మొదటి బంతినే సిక్సర్ కొట్టి సంచలన రీతిలో తనొచ్చానని ప్రపంచానికి స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు మొదటి మ్యాచ్ అంటేనే అదో రకమైన టెన్షన్ ఉంటుంది. అందునా టీనేజర్. ప్రపంచమంతా చూస్తోంది. కోటి 10 లక్షల రూపాయలు పెట్టి 14 ఏళ్ల చిన్న పిల్లాడిని రాజస్థాన్ ఎందుకు కొనుక్కుంది అని. తను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ గా మలిచి అన్నింటికీ సమాధానం చెప్పాడు సూర్య వంశీ. లక్నో విసిరిన 181 పరుగుల ఛేజింగ్ లో యశస్వి జైశ్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్యవంశీ...సంజూ శాంసన్ గాయం కారణంగా తనకు వచ్చిన రెండు చేతులతోనూ వినియోగించుకున్నాడు. 20 బంతులు 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి మార్ క్రమ్ బౌలింగ్ లో క్రీజు బయట అడుగుపెట్టి బ్యాలెన్స్ చేసుకోలేక కీపర్ పంత్ చేతిలో స్టంప్ అవుటయ్యాడు. ఇక అంతే రీప్లేలో అవుటని తేలగాని కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానం వదిలి వెళ్లాడు. చిన్న పిల్లాడు కదా హాఫ్ సెంచరీ చేస్తానని అనుకున్నాడు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆడిన అద్భుతమైన ఆటకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంలు వెల్లువెత్తున్నాయి. అసలు అంత ధైర్యంగా మొదటి బంతినే సిక్స్ గా ఎలా కొట్టాడని చాలా మాజీలు పొగడ్తలతో ముంచి లేపుతుంటే ఈ రోజు వైభవ్ సూర్యవంశీ లాంటి 8వ తరగతి చదివే పిల్లాడు ఆడే క్రికెట్ ను చూడటానికి పొద్దున్నే అలారం పెట్టుకుని లేచానని మైక్రోసాఫ్ట్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. పిఫా వరల్డ్ కప్ తన అఫీషియల్ స్పోర్ట్స్ పేజ్ లో సూర్యవంశీ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ రేంజ్ లో తన తొలి ఇన్నింగ్స్ తోనే ప్రకంపనలు రేపాడనన్న మాట ఈ టీనేజ్ సంచలనం.





















