అన్వేషించండి

Shiva Tandava Stotram: రావణుడు రచించిన ఈ స్తోత్రమే 'బాహుబలి' సినిమాలో పాట!

Shiva Tandava Stotram Lyrics: పరమేశ్వరుడిని వివిధ రూపాల్లో వర్ణించిన స్తోత్రం శివతాండవస్తోత్రం. రావణుడికి ఉండే శివభక్తి మొత్తం ఈ స్తోత్రంలో స్పష్టమవుతుంది.. దీనిని రచించింది కూడా దశకంఠుడే..

Shiva Tandava Stotram: రావణుడు గొప్ప  శివ భక్తుడు. శివుడి నుంచి ఎన్నో వరాలు పొందాడు. శివుడుని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రం రచించాడు. ఈ స్తోత్రం రావణుడిలో ఉండే ఆధ్యాత్మిక సంపదను చూపిస్తుంది.  శంకరుడిని కరుణామూర్తిగా, నటరాజుగా, విశ్వనాథుడుగా, మహాకాళుడిగా వర్ణిస్తూ.. శివుడి శక్తి, సౌందర్యం ఇదంతా తాండవ స్తోత్రంలో ఉంటుంది. సృష్టి, స్థితి, లయానికి ప్రతీకగా శివుడి భయంకరమైన నృత్యం లోకాలను దడపుట్టిస్తుంది. శివ శక్తిని, ఆధిపత్యాన్ని గొప్పగా ప్రశంసించే శివతాండవ స్తోత్రాన్ని పఠించేవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు.  

బాహుబలి సినిమాలో..మహేంద్ర బాహుబలి శివలింగాన్ని పెకిలించి తీసుకెళ్లి గంగమ్మ దగ్గర పెట్టే సన్నివేశంలో ఎవ్వడంట ఎవ్వడంట అనే పాట వస్తుంది..ఆ సాంగ్ స్టార్టింగ్ లో వినిపించే లిరిక్స్...రావణుడు రచించిన శివతాండవ స్తోత్రం నుంచి తీసుకున్నేదే...

శివతాండవ స్తోత్రం (Shiva Tandava Stotram Lyrics)

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥  

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥  

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥  

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥  

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ॥ 

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే ।
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ॥  

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః ।
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ॥  

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ ।
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥  

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ ।
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ॥  

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ ।
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ॥  

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః ।
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ॥  

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ ।
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ॥  

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ ।
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ॥  

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే ।
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః ॥

రావణుడు అపారమైన శక్తులు, వరం పొందేందుకు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం కావడంతో ఆత్మలింగాన్ని ఇమ్మని కోరతాడు. ఆ ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లి ప్రతిష్టించాలనుకున్నాడు. మార్గమధ్యలో ఈ శివలింగాన్ని ఎక్కడా భూమిపై ఉంచకూడదని చెబుతాడు శివుడు. కానీ గోకర్ణం చేరుకునేసరికి సంధ్యాసమయం కావడంతో ఆ శివలింగాన్ని ఓబాలుడి చేతిలో పెట్టి సంధ్యవార్చేందుకు వెళతాడు. రావణుడు అటు వెళ్లగానే..బాలుడిరూపంలో ఉన్న వినాయకుడు ఆ శివలింగాన్ని నేలపై పెట్టేసి వెళ్లిపోతాడు. ఆ ప్రదేశమే గోకర్ణం. అలా రావణుడికి శివుడు ఇచ్చిన వరం విఫలమైంది.

 భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి సంగీతం అత్యంత శక్తివంతమైన సాధనం.  శివుడు రావణుడి సంగీతంలో నిమగ్నమై అమితానందం పొందాడు.  శివ తాండవ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అపారమైన శక్తి, అందం, మానసిక బలం లభిస్తుంది.  ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి వాతావరణం పవిత్రంగా మారుతుంది.

Also Read: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Advertisement

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Embed widget