అన్వేషించండి

Planets associated with acting: సినిమా ఇండస్ట్రీలో వెలగాలంటే ఈ గ్రహాల అనుగ్రహం ఉండాలా?

Planets associated with acting: నటనలో విజయం కోసం జ్యోతిషశాస్త్రంలో రెండు గ్రహాలు ముఖ్యమైనవి. అవి ఏంటో చూద్దాం.

 Mercury and Venus connection to acting:  ప్రస్తుతం జనరేషన్ కి నటనపై మక్కువ ఎక్కువ. అయితే సినిమాలు లేదంటే సీరియల్స్ లేదంటే షార్ట్ ఫిల్మ్స్, యూ ట్యూబ్ వీడియోస్,  ఇన్ స్టా రీల్స్ ఇలా ప్రతి ఒక్కరూ తమలో ఉండే నటనా ప్రతిభను ఏదో వేదికపై ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సినిమా ప్రపంచంలో గ్లామర్, డబ్బు, పేరు , కీర్తి అన్నీ లభిస్తాయి. అయితే అందర్లో ఈ ఆలోచన, ఆశ ఉన్నా...ప్రతి ఒక్కరూ నటులైపోలేరు. కష్టం, అదృష్టం తోపాటూ గ్రహాలు కూడా అనుకూలించాలని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 

స్టార్ గా వెలగాలంటే కొన్ని గ్రహాల అనుగ్రహం ఉండాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.  

నటనతో ఏ గ్రహాలు సంబంధం కలిగి ఉన్నాయి?

నటనా రంగంలో గొప్ప పేరు తెచ్చుకోవాలంటే..ముందు మీలో బలమైన కోరిక ఉండాలి, సమస్యలను దాటుకుని అడుగువేసే ధైర్యం ఉండాలి.. కష్టపడే మనస్తత్వం ఉండాలి. వీటితో పాటూ జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు (Jupiter) శుక్రుడు (Venus) గ్రహాల అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు కళకు సంబంధించిన రంగానికి బాధ్యత వహిస్తాయి.

ఒక వ్యక్తి జాతకంలో  బుధుడు (Jupiter) శుక్రుడు (Venus)  గ్రహాలు పంచమ స్థానంలో ఉంటే...వారు నటనా రంగంలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు ప్రసంగ కారకుడు, అయితే శుక్రుడు కళతో సంబంధం కలిగి ఉంటాడు.

బుధుడు-శుక్రుడు కలయిక కళతో ముడిపడి ఉంది 

బుధుడు చంద్రుడు... శుక్రునితో సంబంధం కలిగి ఉంటే ఆ వ్యక్తి తెరపై ఓ వెలుగు వెలుగుతారు..డైలాగ్స్ అద్భుతంగా చెబుతారు.  అదే సమయంలో  శుక్రుడు మంచి కళా ప్రదర్శన విషయంలో వ్యక్తిని నిపుణుడిగా చేస్తాడు.

శుక్ర గ్రహాన్ని ఆనందం, భోగం, ఐశ్వర్యం, వినోదం ,అందానికి సంబంధించిన గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో, ఈ గ్రహాలు బలంగా ఉండటం వల్ల వ్యక్తి సినిమా  నాటక ప్రపంచంలో విజయం సాధిస్తాడు.

జాతకంలో లగ్నం , లగ్న స్థానం బలంగా ఉండటం వల్ల సినిమా టెలివిజన్‌లో కెరీర్‌లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. దీనితో పాటు, వ్యక్తి ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా విజయం సాధిస్తాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్నా, వెలగాలన్నా ముందుగా ఉండాల్సిన లక్షణం ఇదే.

గ్రహాల అనుగ్రహం కన్నా కృషి  అంకితభావం అవసరం

జాతకంలో ఐదవ స్థానం బలంగా ఉంటే సినిమా ప్రపంచంలో తారగా వెలగొచ్చు..అయితే ఐదో స్థానం బలంగా ఉంది కదా మన ప్రయత్నం లేకుండా కూడా వెలిగిపోవచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే గ్రహాల అనుగ్రహం ఉన్నా..మీ కృషి , నిజమైన అంకితభావం పెద్ద పాత్ర పోషిస్తాయి. జాతకంలోని తొమ్మిది గ్రహాలు కూడా కష్టపడి తమ స్థానాన్ని పొందిన వారికి మాత్రమే మద్దతు ఇస్తాయి. 

అంతెందుకు..ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. శని న్యాయ నిర్ణేత..అందుకే కష్టపడి చమటోడ్చే వారిపై ప్రభావం తక్కువ చూపిస్తాడని చెబుతారు. అందుకే శ్రమను నమ్ముకుంటే గ్రహాల అనుగ్రహం కూడా మీకు కలిసొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఈ ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. 

2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget