RR vs LSG Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 2పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం | ABP Desam
ఈ ఐపీఎల్ లో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగు పర్చుకోవాలంటే తప్పనిసరిగా రాణించాల్సిన పరిస్థితిలో రాజస్థాన్ రాయల్స్...టాప్ 4 లో ప్లేస్ లో స్థానమే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్ హోరా హోరీగా తలపడిన మ్యాచ్..లాస్ట్ ఓవర్ డ్రామాగా మారి చివరకు విజయం లక్నో నే వరించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. మార్ క్రమ్ మాస్ షో
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కి ఓపెనర్ ఏడెన్ మార్ క్రమ్ మాస్ ఆరంభాన్ని ఇచ్చాడు. బీభత్సమైన ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ మిచ్ మార్ష్ 4 పరుగులకే అవుటైనా..మరో సూపర్ స్టార్ నికోసల పూరన్ 11 పరుగులకే వెనుదిరిగినా లక్నో కు కొండంత అండలా నిలబడ్డాడు ఏడెన్ మార్ క్రమ్. పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయిన LSG మరింత ఇబ్బంది పడకుండా నిదానంగా ఆడినా పరిస్థితులకు తగిన ఆటతీరును ప్రదర్శించాడు మార్ క్రమ్. 45 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి హసరంగ బౌలింగ్ లో అవుటయ్యాడు మార్ క్రమ్.
2. భళా బడోనీ
కెప్టెన్ పంత్ మళ్లీ 3 పరుగులకే అవుటైనా మార్ క్రమ్ తో కలిసిన బడోనీ LSG స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 34 బంతులు ఆడి 5 ఫోర్లు ఓ సిక్సర్ తో సరిగ్గా 50 పరుగులు చేసిన ఆయుష్ బడోనీ..తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో శుభం దూబేకి క్యాచ్ ఇచ్చి అవుటైనా అప్పటికి LSG కాస్త గౌరవప్రదమైన స్కోరుకు తీసుకువెళ్లాడు.
3. అబ్దుల్ సమద్ సిక్సర్ల మోత
మార్ క్రమ్, బడోనీ హాఫ్ సెంచరీలు కొట్టినా LSG స్కోరు 140ల్లోనే ఉంది. మరి అలాంటి స్కోరు బోర్డు మ్యాచ్ ముగిసే సరికి 180 అయ్యిందంటే అదంతా అబ్దుల్ సమద్ మ్యాజిక్ అనే చెప్పాలి. రాజస్థాన్ తరపున సీనియర్ బౌలర్ సందీప్ శర్మ వేసిన బౌలింగ్ ధోని లాంటి వాడికే ఆడటం కష్టం. అలాంటిది అబ్దుల్ సమద్ ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఆడినా ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సులు బాది సమద్ మ్యాచ్ ఫినిష్ చేయటంతో LSG రాజస్థాన్ రాయల్స్ కి 181 పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది.
4. చిన్న వయస్సు చిచ్చర పిడుగు
రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో ఓ రిస్క్ చేసింది. సంజూ శాంసన్ గాయం కారణంగా మ్యాచ్ ఆడకపోవటంతో తన ప్లేస్ లో 14 ఏళ్ల చిన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయించింది. జైశ్వాల్ కి తోడుగా వైభవ్ ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే అయినా…... వైభవ్ సూర్యవంశీ లార్డ్ అని పిలుచుకునే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో….. తను ఆడిన తొలిబంతికే సిక్సర్ బాది ఘనంగా కెరీర్ ను ప్రారంభిచాడు. 20 బంతులు మాత్రమే ఆడి 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన సూర్య వంశీ జైశ్వాల్ తో కలిసి 85 పరుగుల మొదటి వికెట్ పార్టనర్ షిప్ పెట్టి మార్ క్రమ్ బౌలింగ్ లో అవుటైపోయాడు. ఈ యంగ్ సెన్సేషన్ ఫస్ట్ మ్యాచ్ లో స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు.
5. జయహో యశస్వి - లాస్ట్ ఓవర్ డ్రామా
వైభవ్ సూర్యవంశీతో చాలా వేగంగా పరుగులు చేయటం ప్రారంభించిన యశస్వి జైశ్వాల్..తన సీనియార్టిని యూజ్ చేస్తూ LSG బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 52 బాల్స్ ఆడి 5 ఫోర్లు 4 సిక్సర్లతో 74 పరుగులు చేసిన జైశ్వాల్ RR ను లక్ష్యంగా దిశగా నడిపాడు. జైశ్వాల్ నుంచి కెప్టెన్ పరాగ్ నుంచి మంచి సహకారం అందింది. 26 బాల్స్ లో 39 పరుగులు చేసి పరాగ్, ఆ వెంటనే జైశ్వాల్ అవుటైపోవటంతో మ్యాచ్ ఆఖరి రెండు ఓవర్లలో ఉత్కంఠగా మారింది. లాస్ట్ ఓవర్ లో మొన్న ఢిల్లీ మ్యాచ్ లోలాగానే 9 పరుగులు చేయాల్సి రావటంతో..మళ్లీ సూపర్ ఓవర్ కి వెళ్తుందా అనే టెన్షన్ మొదలైంది. కానీ ఆవేశ్ ఖాన్ పదునైన యార్కర్లతో అద్భుతంగా బౌలింగ్ చేయటంతో పాటు ప్రమాదకర హెట్మెయర్ ను అవుట్ చేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి LSG కి ఊహించని రీతిలో రెండు పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో అనూహ్య రీతిలో గెలిచిన LSG ఆర్సీబీ ని కిందకు లాగి పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానాన్ని సంపాదిస్తే..మ్యాచ్ ఓడినా రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలోనే కొనసాగుతోంది.




















