అన్వేషించండి
FIFA WC Qatar 2022: ఫిఫా స్టేడియాలు చూస్తారా! ప్రతి స్టేడియానికీ ఓ స్పెషాలిటీ!
FIFA WC Qatar 2022: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ దేశంలో జరుగుతోంది. అద్భుతమైన 8 స్టేడియాలను ఇందుకు సిద్ధం చేసింది. ఇంతకీ ఆ వేదికల పేర్లేంటి? సీటింగ్ సామర్థ్యం ఎంత? ఏ నగరాల్లో ఉన్నాయో తెలుసుకుందాం.

ఫిఫా స్టేడియాలు
1/8

అల్ బయత్ స్టేడియం: ఫిఫా ఆరంభ మ్యాచ్ జరిగిదే ఇక్కడే. అల్ ఖర్ నగరంలో నిర్మించారు. సెంట్రల్ దోహాకు ఉత్తరాన 35 కి.మీ దూరంలో ఉంటుంది. సీటింగ్ సామర్థ్యం 60వేలు.
2/8

లుసెయిల్ స్టేడియం: ఫ్యూచర్ ఐకాన్‌గా దీనిని నిర్మించారు. ఫిఫా ఫైనల్ మ్యాచ్ జరిగిదే ఇక్కడే. సెంట్రల్ దోహాకు 20 కిలోమీటర్ల దూరంలోని లుసెయిల్ సిటీలో నిర్మించారు. 80 వేల మంది ప్రత్యక్షంగా చూడొచ్చు.
3/8

స్టేడియం 974: సెంట్రల్ దోహాకు 10 కిలోమీటర్ల దూరంలో రస్ అబు అబౌద్‌లో నిర్మించారు. ఇదో విచిత్రమైన స్టేడియం. షిప్పింగ్ కంటెయినర్లతో ఈ స్టేడియం కట్టారు. సీటింగ్ సామర్థ్యం 40వేలు.
4/8

అల్ తుమామా స్టేడియం: వృత్తాకారంలో వజ్రాలు పొదిగినట్టుగా ఉంటుంది. అల్ తుమామాలో నిర్మించారు. 40వేల మంది కూర్చొని చూడొచ్చు.
5/8

అహ్మద్ బిన్ అలీ స్టేడియం: ఎడారిలో నిర్మించిన స్టేడియం ఇది. సెంట్రల్ దోహాకు పశ్చిమ దిశగా 20 కిలోమీటర్ల దూరంలోని ఎమ్ అల్ అఫెయిలో ఉంది. 40వేల మంది పడతారు.
6/8

ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం: సెంట్రల్ దోహాకు వాయువ్య దిశగా 13 కి.మీ దూరంలో ఉంటుంది. అల్ రియాన్ నగరంలో నిర్మించారు. 40వేల సామర్థ్యం.
7/8

ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం: రీ ఇంజినీరింగ్ టెక్నాలజీతో నిర్మించారు. దోహాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీటింగ్ సామర్థ్యం 40వేలు.
8/8

అల్ జనాబ్ స్టేడియం: అద్భుతమైన నిర్మాణ కళకు ఇదో ప్రతీక. దోహాకు 22 కిలోమీటర్ల దూరంలో అల్ వక్రాలో నిర్మించారు. సీటింగ్ కెపాసిటీ 40వేలు. స్టేడియం పైకప్పు మల్లెపువ్వు ఆకృతిలో ఉంటుంది.
Published at : 12 Nov 2022 04:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
అమరావతి
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion